తెలంగాణరాజకీయం

ఫాంహౌస్ బఫర్ జోన్‌లో ఉంటే దగ్గరుండి కూలగొట్టిస్తా…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : జన్వాడ ఫాంహౌజ్ పై క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలిసిన మిత్రుడిది లీజుకు మాత్రమే తీసుకున్నానని చెప్పారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టేందుకు సహకరిస్తా.. తప్పు ఉండి కూల్చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

మంత్రి పొంగులేటి, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌస్ లు ఉన్నాయి.. సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా నేను చూపిస్తా. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి..నాకు లేదు. పొంగులేటి ఫామ్ హౌస్ ఎఫ్ టీఎల్ పరిధిలో ఎలా ఉంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎఫ్ టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ ఎలా కట్టారు. మంత్రుల ఫామ్ హౌస్ లతోనే కూల్చివేతలు ప్రారంభించాలని కేటీఆర్ అన్నారు.

Read More : లండన్‌కు వైఎస్ జగన్ జంప్?

సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. తాము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు. భారత రైతు సమితి కూడా అని చెప్పారు. దీనికి నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు చేస్తామన్నారు. రైతురుణమాఫీ ఎప్పటిలోపు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు . సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదన్నారు కేటీఆర్.

Related Articles

Back to top button