తెలంగాణ

అగ్గిపెట్టె హరీష్.. రాజీనామా చెయ్..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం ఓ రేంజ్ లో సాగుతోంది. రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కాక రేపుతోంది. సిగ్గుంటే రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ లో వెలిసిన పోస్టర్లు సంచలనంగా మారాయి.

హరీష్ రావుకు వ్యతిరేకంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి.మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట కొందరు ఈఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.’దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు..

Read More : చంద్రబాబు దెబ్బకు వణికిపోతున్న రేవంత్!

రుణమాఫీ అంశంపై గతంలో ప్రభుత్వానికి పలు అంశాలపై హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ సర్కార్, రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను అమరవీరులల స్థూపం వద్ద రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హరీష్‌కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ కామెంట్లు చేయటంతోపాటు తాజాగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో గానీ, తెలంగాణ చరిత్రలో గానీ ఇంతగా దిగజారిన దిక్కుమాలిన సీఎం ఇంకెవరూ లేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు.

Related Articles

Back to top button