తెలంగాణ

అమ్మవారికి దండం పెట్టి భక్తి చాటుకున్న దొంగ

వడ్డెపల్లి శ్రీ నల్లపోచమ్మ గుడిలో హుండీ దోచుకునేందుకు యత్నం

హుండీ దోచుకునేందుకు యత్నం ముసుగులో వచ్చిన దొంగ

ఫలితం లేకపోవడంతొ అమ్మవారికి దండం పెట్టి భక్తి చాటుకొని తిరిగి వెళ్లి పోయాడు

రెండు సిసి కెమెరాలలో రికార్డు అయిన దృశ్యం

క్రైమ్ మిర్రర్, హత్నూర ప్రతినిధి జూలై 16 : హత్నూర మండల పరిధిలోని వడ్డెపల్లి గ్రామంలో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి గుడిలోకి ఒక ముసుగు దొంగ  ప్రవేశించాడు. మంగళవారం నాడు ఉదయం 3 గంటల 49 నిముషాల కు ఒక దొంగ బ్లూ జీన్స్ ప్యాంటు భూడిద రంగు జెర్కిన్ నల్లటి తెల్ల చారలు ఉన్న షర్ట్ వేసుకొని మూతికి మాస్కు వేసుకొని ఉన్నాడు. చేతిలో ఒక పరికరంతో వచ్చి హుండీ తెరువడానికి ప్రయత్నిచిన ఫలితం లేకపోవడంతొ అమ్మవారికి దండం పెట్టి భక్తి చాటుకొని తిరిగి వెళ్ళిపోవడం విశేషం. ఆ దొంగకు కెమెరాలు ఉన్నట్టు తెలుసేమో కాబోలు ఒక పథకం ప్రకారం ముందుగానే మొఖం కనబడకుండా తగు జాగ్రత్తలు పడ్డట్టు తెలుస్తుంది. గతంలో ఇదే ఆలయంలో రెండు సార్లు దొంగతనం జరిగింది. అప్పుడు హుండీ ఊరవతల  లభ్యం అయింది. కాని ఈ సారి ఒక దొంగ హుండీ తెరవడానికి యత్నించి విఫలం అయ్యాడు.

 

  Read also:    రైలు కిందపడి నవ దంపతుల ఆత్మహత్య…

ఇవికూడా చదవండి

  1. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్…
  2. అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  3. రైతు రుణమాఫీకీ మార్గదర్శకాల జారీ.. అదే ప్రామాణికం!!!
  4. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ సంచిత్ గంగ్వార్
  5. కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!

 

Related Articles

Back to top button