తెలంగాణనల్గొండమహబూబ్ నగర్రంగారెడ్డి

అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు…ఐజిపి సత్యనారాయణ..

ప్రత్యేక ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): అవినీతికి పాల్పడిన పోలీసులను సైతం వదలకుండా, కఠిన చర్యలు తీసుకున్నారు ఐజిపి సత్యనారాయణ.. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ సమీపంలోని, ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని, కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది పేకాట రాయుళ్లు, భారీ స్థాయిలో పేకాట ఆడుతుండగా, జిల్లా పోలీస్ బృందం వారి స్తావరాలపై దాడి చేసి వారిని పట్టుకున్నారు. ఆ పేకాట దాడిలో వచ్చిన ఆరోపణల మేరకు, జోగులాంబ గద్వాల్ ఎస్పీ శ్రీనివాస్ రావుతో పాటు, కొంతమంది అధికారులతో ఎంక్వయిరీ చేయించిన అనంతరం, ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీజోన్ -11 వి.సత్యనారాయణ ఉపక్రమించారు. వీరిలో జోగులాంబ గద్వాల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ జములప్ప, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట ఎస్సై విక్రం పేకాట రాయుళ్లతో, పరోక్ష సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.

ఉండవల్లి ఎస్సై శ్రీనివాసులు తన పోలీస్ స్టేషన్ పరిధిలో, అంత పెద్ద ఎత్తున పేకాట జరుగుతున్నప్పటికీ, ఈ పేకాట ముఠాపై జిల్లా పోలీసులు దాడి చేసే వరకు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలిందన్నారు. దింతో ఈ ముగ్గురు అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి, విఆర్లో పెట్టినట్లు వెల్లడించారు. ఇంతే కాకుండా వారిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Read More : నల్లవెల్లి రెవెన్యూ పరిధి మాల్ లో నీకు ఈ ప్లాట్లు ఎక్కడివి రవీందర్? 

ఇటీవల టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల, గట్టు ప్రాంతాల సందర్శన సమయంలో, ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణను సమర్థవంతంగా నిలువరించలేనందున, గద్వాల్ సిఐ భీమ్ కుమార్ ను, మల్టీజోన్-11 విఆర్ కు అటాచ్ చేశారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఏ పోలీస్ అధికారైనా, ఉదాసీనత, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, వేటు తప్పదని ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. పేకాట, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా, మాదకద్రవ్యాల రవాణా, విషయంలో ఏ పోలీస్ అధికారి అయినా ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై వేటు తప్పదని ఐజిపి హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button