ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రా రాజకీయాల్లో సంచలనం.. టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.ఆ ఓ ప్రైవేటు హోటల్‌లో అర్థనగ్నంగా ఓ మహిళా నాయకురాలితో ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే, వాటిని బాధిత మహిళే మీడియాకు రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. తాను ఎమ్మెల్యే అన్న బలంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి లైంగిక దాడికి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఎవరికైనా విషయం చెబితే అందరినీ చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడంటూ ఆమె మీడియాకు తెలిపింది.

ధైర్యం చేసి పెన్ కెమెరాతో తాను ఎమ్మెల్యే నిజ స్వరూపాన్ని బయట పెట్టానని పేర్కొంది. ఇప్పటికే మూడు సార్లు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధిత మహిళ వాపోయింది. అయితే, ఈ విషయంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జరిగిన ఘటనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పార్టీ అంతర్గత కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button