క్రైమ్

ఎండు గంజాయిని తరలిస్తున్న ఐదుగురి అరెస్టు…నిందితుల వద్ద నుంచి 254 కిలోల గంజాయి స్వాధీనం.

గండిపేట్‌(క్రైం మిర్రర్‌): అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న ఐదుగురు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 254 కేజీల ఎండు గంజాయి, రెండు కార్లు, ఏడు మొబైల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 1,04,65,700 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రాజేంద్రననగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసిన విలేకేరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్‌ వివరాలను వెల్లడించారు. యూపీకి చెందిన ఠాకూర్‌ సచిన్‌సింగ్‌(30), మహ్మద్‌ నదీమ్‌(21), మహ్మద్‌ సక్లీన్‌(24), మహ్మద్‌ సలీమ్‌(24), ప్రశాంత్‌సింగ్‌(22)లు ఏపీలోని అరకు లోయ నుంచి తరచు ఎండు గంజాయిని సరఫరా చేస్తుంటారు.

ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన ఠాకూర్‌ సింగ్‌ తన వాహనాన్ని అరకు నుంచి హైదరాబాద్‌కు ఎస్కార్ట్‌ చేయడానికి ముంబై నదీమ్, సక్లైన్, సలీమ్‌ల నుంచి తనకు తెలిసిన పెడ్లర్లను పిలిచాడు. ఆయన పిలుపు మేరకు ముంబై పెడ్లర్స్‌ ఎర్టిగా కారులో విజయవాడ చేరుకున్నారు. సచిన్, వినోద్, రవి, ప్రశాంత్‌సింగ్‌ 7వ తేదీన విజయవాడలో ముంబై పెడ్లర్స్‌తో చేరారు., వారు 8వ తేదీన అరకు లోయకు చేరుకోని ప్రధాన సరఫరాదారు రాజును సంప్రదించి 254 కేజీల ఎండు గంజాయిని కోనుగోలు చేశారు. వారు 150 కేజీలను యూపీలోని అమిత్‌సింగ్‌కు డెలివరీ చేయాల్సి ఉంది. మరో 100 కేజీలు ముంబై పెడ్లర్లు వారు ఎండు గంజాయిని అరకులోయ నుంచి హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ మీదుగా ఉత్తరప్రదేశ్, ముంబైకి రవాణా చేయాల్సి ఉంది. ఎప్పటిలాగే 10వ తేదీన హైదరాబాద్‌కు చేరుకోని రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిమితికి సమీపంలో గల ఓఆర్‌ఎస్‌ వద్ద సర్వీస్‌ రోడ్డులో 100 కేజీల గంజాయిని ముంబై పెడ్లర్స్‌ కారుకు తరలించేందుకు తమ కార్లను ఆపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసు బృందం రెండు వాహనాలను ఎగ్జిట్‌ నెంబర్‌ 17 వద్ద ఎంహెచ్‌ఈఈ4530, ఓడి33వి3204లో అడ్డుకున్నారు. ఓడి33వి3204లో 254 కేజీల పోడి గంజాయి ప్యాకెట్లు, మరోక వాహనం ఎంహెచ్‌01ఈఈ4530 పైలటింగ్‌ ప్రధాన వాహనంగా ఉన్నాయన్నారు. పోలీసులను చూసిన వినోద్‌కుమార్‌యాదవ్, రవీందర్‌యాదవ్‌లు అక్కడ నుంచి పరారైయ్యారు. అంతేకాకుండా పోలీసులు ఐదుగురు ప్రతివాదులను అదుపులోకి తీసుకున్నారు. ఠాకూర్‌ సచిన్‌ సింగ్‌ నుంచి 254 కేజీల ఎండు గంజాయి, 32 కంట్రీ మేడ్‌ పిస్టల్‌తో పాటు 11 రౌండ్లతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల పరిశీలనలో సచిన్‌ ప్రయాణిస్తున్న ఎర్టిగా వాహనానికి ఎంహెచ్‌42బిటి2206 స్థానంలో ఓడి33వి3204 అనే నకిలీ నెంబర్‌ను అమర్చారని, అందులో ఎండు గంజాయి రవాణా చేసినట్లు తెలిసిందన్నారు.

ఎండు గంజాయి 254 కేజీలు విలువ రూ.88,90,000, 32 పిస్టల్‌(కంట్రీమెడ్‌)తో 11 రౌండ్లు విలువ రూ.1లక్ష, రెంండు మారుతీ సుజుకి ఎర్టిజా కార్లు రూ.14 లక్షలు, మొబైల్‌ ఫోన్లు ఏడు ఒక కీప్యాడ్‌ విలువ 70 వేలు, నకిలీ నగదు 3700, జియో డాంగిల్‌ –1 విలువ 2 వేలు మొత్తం 1,04,65,700 ఉంటుందన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఓటీ డీసీపీ డి.శ్రీనివాస్, అడిషనల్‌ ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ రాజేంద్రనగర్‌ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డి, కాస్ట్రో, పోలీసులున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button