తెలంగాణ
Trending

కవితకు బెయిల్ ఇప్పిస్తున్న సీఎం రేవంత్ లాయర్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉండటంతో.. ఆమె కేంద్రంగా విలీనంపై మాటల తూటాలు పేలుతున్నాయి. కూతురు కవితకు బెయిల్ కోసం బీజేపీ పెద్దలతో కేసీఆర్ ములాఖత్ అయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పదేపదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ యే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు విన్పిస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగానే అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ వేయించారని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు, ప్రభుత్వంలో మంత్రి పదవులిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫాంహౌజ్ కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యనించారు.

పదేపదే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసుకోబోతున్నారంటూ దుష్ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు బండారం బయటపడిందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ నేతలే కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇఫ్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కవిత బెయిల్ కోసం కోర్టులో వాదిస్తున్నారని తెలిపారు.

Read More : జైలులోనే ఎమ్మెల్సీ కవిత.. సుప్రీంకోర్టు బిగ్ షాక్ 

పెద్ద వకీలు అయిన సింఘ్వీ తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి అవుతున్నాడంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కోర్టులో, పార్లమెంట్ లో గట్టిగ వాదిస్తడని అనుకున్నా. కానీ తీరా చూస్తే… లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత కు బెయిల్ ఇవ్వాలని వాదిస్తున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్ళు కేసీఆర్ కుటుంబ అవినీతిని బట్టబయలు చేస్తాం… జైలుకు పంపిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఆ కుటుంబాన్ని ఎందుకు జైలుకు పంపలేదని నిలదీశారు. ఎందుకంటే కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి కాబట్టి. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, మియాపూర్ భూములు, ఫోన్ ట్యాపింగ్ కేసులన్నీ అటకెక్కించారని ఆరోపించారు బండి సంజయ్. రెండు పార్టీలు ఒక్కటే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు కల్ల. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీ. ఆ పార్టీతో పొత్తు ఉండదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి, కుటుంబ పార్టీలే. కాబట్టి కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం తధ్యమని తేల్చి చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button