తెలంగాణ

కవిత కేసులో నవ్వులపాలవుతున్న తెలంగాణ కాంగ్రెస్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కాంగ్రెస్ తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. జాతీయ స్థాయిలో నవ్వుల పాలవుతోంది. ఈ కేసు విషయంలో ఢిల్లీ నేతలు ఒకలా మాట్లాడుతుంటే.. తెలంగాణ నాయకులు మరోలా మాట్లాడుతున్నారు. దీంతో లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేతల వింత దోరణిపై ఇండియా కూటమి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వంంలో లిక్కర్ స్కాం జరిగిందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. బీజేపీ ఎంపీల ఫిర్యాదుతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారాయని గుర్తించి కేసు నమోదు చేశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసొడియాను మొదటగా అరెస్ట్ చేసింది ఈడీ. తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. కవిత తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను జైలుకు పంపింది ఈడీ. ఈ కేసులోనే సీబీఐ కూడా ఈ ముగ్గురిని విచారించి అరెస్ట్ చేసింది. ఈ కేసులో 15 నెలల జైలు జీవితం తర్వాత ఇటీవలే సిసోడియా రిలీజ్ అయ్యారు. ఐదున్నర జైలు జీవితం తర్వాత ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. వచ్చే వారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఆయనకు ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. వచ్చే వారం సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కాంగ్రెస్ జాతీయ నేతలు ఒకలా, తెలంగాణ నేతలు మరొలా మాట్లాడటం విమర్శల పాలవుతోంది. లిక్కర్ స్కాం బోగస్ అని.. కేజ్రీవాల్ ను అన్యాయం అరెస్ట్ చేశారని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు పదేపదే మాట్లాడుతున్నారు. ఈడీ, సీబీఐని వాడుకుని ప్రత్యర్థి పార్టీల నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని మండిపడుతున్నారు. అదే సమయంలో లిక్కర్ స్కాంలోనే జైలుకు వెళ్లిన కవిత విషయంలో మాత్రం సీబీఐ, ఈడీ చేసింది కరెక్టే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. లిక్కర్ స్కాం బోగస్ అని రాహుల్ గాంధీ చెబుతున్నారంటే.. ఈ కేసులో కవిత అరెస్ట్ కూడా అక్రమమని చెబుతున్నట్లేగా. మరీ కవిత అరెస్టును సమర్ధిస్తూ తెలంగాణ నేతలు ఎలా మాట్లాడుతున్నారనే టాక్ వస్తోంది.

బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా నేతలు మాట్లాడుతున్నారు. వచ్చే వారం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీతో ఆర్ కుమ్మక్కు కావడం వల్లే కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పదలుచుకున్నారా అన్న చర్చ వస్తోంది. అంటే కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఆప్ కూడా బీజేపీతో డీల్ చేసుకుందనే చందంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం లోనే కాంగ్రెస్ నేతలు రెండు నాల్కల దోరణిని కాంగ్రెస్ కూటమి పక్షాలే ప్రశ్నిస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button