తెలంగాణ

కాస్కో రేవంత్.. వడ్డీతో సహా చెల్లిస్తా.. కవిత శపథం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత 165 రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చింది. అన్న కేటీఆర్, హరీష్ రావుతో కలిసి హైదరాబాద్ వచ్చిన కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు గ్రాండ్ వెల్ కం చెప్పారు .శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దాదపు 5 వందల కార్ల భారీ ర్యాలీతో తన ఇంటికి చేరుకున్నారు కవిత. ఆమెకు ఎయిర్ పోర్టు నుంచి జూబ్లిహిల్స్ వరకు అడుగడుగునా స్వాగతం లభించింది. కవిత నివాసం దగ్గర మధ్యాహ్నం నుంచే సందడి నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం చెప్పారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం తెలిపారు. కవిత ఇంట్లోకి ఎంటరవుతుండగా పూలు చల్లుతూ ఆమెకు మద్దతుగా అభిమానులు నినాదాలు చేశారు. కాబోయే సీఎం కవిత అంటూ కొందరు స్లోగన్స్ చేశారు.

తన ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్నారు కవిత. తన తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అన్న కేటీఆర్ కు రాఖీ కట్టారు కవిత. పార్టీ నేతలకు కూడా రాఖీలు కట్టారు. తన కోసం వచ్చిన అందరికి అభినందలు చెప్పారు. దాదాపు 6 నెలల తర్వాత ఇంటికి వచ్చిన కవితను చూసేందుకు కుటుంబ సభ్యులంతా వచ్చారు. కేటీఆర్ సతీమణి శైలిమ, హరీష్ రావు భార్యలు మధ్యాహ్నమే కవిత ఇంటికి వచ్చి ఏర్పాట్లు చూశారు. కవిత రాగానే ఆమెకు ఎదురేగి స్వాగతం చెప్పారు. దిష్టి తీసి మంగళహారతులతో స్వాగతం చెప్పారు. అయితే కూతురిని చూసేందుకు కేసీఆర్ మాత్రం రాలేదు. గురువారం ఉదయం తన తండ్రిని చూసేందుకు కవిత ఎర్రవల్లి ఫాంహౌజ్ వెళ్లనున్నారు. కేసీఆర్ ఆశ్వీరాదం తీసుకోనున్నారు. రెండు వారాల పాటు తండ్రితో కలిసి ఫాంహౌజ్ లోనే కవిత రెస్ట్ తీసుకుంటారని తెలుస్తోంది. ఈ రెండు వారాలు ఆమె పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండరని చెబుతున్నారు.

తన నివాసం దగ్గర మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయమే గెలిచిందన్నారు కవిత. ధర్మమే గెలుస్తుందని చాల సందర్బాల్లో రుజువు అయిందన్నారు. తనకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. తనపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు కవిత.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button