తెలంగాణ
Trending

కేటీఆర్ అత్యంత సన్నిహితుడు అరెస్ట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అత్యంత సన్నిహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొణతం దిలీప్‌ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా పనిచేశారు. పదేళ్లు కేటీఆర్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఇటీవలే కొణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టుకు వెళ్లడంతో ఆయనకు ఊరట లభించింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఏర్పాడిన విపత్కర సమయాల్లో వరద బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించినందుకు దిలీప్‌ను అరెస్ట్‌ చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలుగా కోణతం దిలీప్‌ను పోలీసులు వేధిస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్ ను ఖండించారు కేటీఆర్. కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందని ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిన బుద్ధి రాలేదన్నారు. ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు కేటీఆర్.

ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే అని కేటీఆర్ ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చునుకుంటే అది మీ భ్రమే అవుతుందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారని తెలిపారు. అక్రమంగా దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button