తెలంగాణ

కేటీఆర్ భార్య పేరు మీదనే జన్వాడ ఫాంహౌజ్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :  జన్వాడ ఫాంహౌజ్ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. జన్వాడలో కేటీఆర్‌దిగా చెబుతున్న ఫాంహౌజ్ కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. దీంతో ఆ ఫాంహౌజ్ ను హైడ్రా కూల్చివేస్తుందనే చర్చ నడిచింది. ఇక ఫాంహౌజ్ ను కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు ఆశ్రయించారు. ఇదిలా ఉండగానే ఫాంహౌజ్ పై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్.. తన పేరు మీద జన్వాడలో ఎలాంటి భూములు లేవని చెప్పారు. తన ఫ్రెండ్ ఫాంహౌజ్ ను లీజుకు తీసుకున్నానని వివరణ ఇచ్చారు. అయితే కేటీఆర్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. జన్వాడ భూములన్నీ కేటీఆర్‌వేనని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. జన్వాడ ఫాంహౌస్ భూములన్నీ కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద ఉన్నాయన్నారు. 2018 ఎన్నికల అఫిడవిట్ లోనూ జన్వాడ భూములను కేటీఆర్ పొందుపరిచారని తెలిపారు. ఈసీకి కేటీఆర్ ఇచ్చిన అఫిడవిట్‌ను మీడియాకు చూపించారు మహేష్ కుమార్ గౌడ్. జన్వాడ భూములపై కేటీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.

కేటీఆర్‌కు పౌరుషం ఉంటే ఫాంహౌస్‌ని కూలగొట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎఫ్టీఎల్‌లో ఉన్న ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని, సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. హైడ్రాకు మంచి పేరు వస్తుందని విగ్రహాల పేరుతో కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు.కేటీఆర్, హరీశ్ రావు డముగిసిందని, బీఆర్ఎస్ పార్టీ కూలిపోయే పరిస్థితిలో బీజేపీని పట్టుకొని వేలాడుతోందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. దురాక్రమణకు గురైన ప్రభుత్వ ఆస్తులని హైడ్రా కాపాడుతుందని స్పష్టం చేశారు. లక్ష చదరపు అడుగుల్లో ఫాంహౌస్ ఉందని, ఎవరైనా భూములను లీజుకు తీసుకుంటారని అన్నారు.

Read More : కడిగిన ముత్యం చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో బిగ్ రిలీఫ్

కానీ, కేటీఆర్ మిత్రుడి ఫాంహౌస్‌ని లీజుకు తీసుకున్నానంటూ కొత్త డ్రామాకు తెర లేపారని చెప్పారు. అది కేటీఆర్ ఫాంహౌస్ అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. అక్రమ కట్టడమని రేవంత్ రెడ్డి ఎన్జీటీకి వెళ్తే అరెస్ట్ చేశారని, జన్వాడ ఫాంహౌస్ భూములన్నీ కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద ఉన్నాయని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button