తెలంగాణ
Trending

ఖమ్మంకు మళ్లీ వరద గండం.. ఇండ్లు ఖాళీ చేస్తున్న జనం

మున్నేరు వాగ ఉప్పొంగడంతో అతలాకుతలమైన ఖమ్మం నగరం ఇంకా తేరుకోలేదు. వారం రోజులవుతున్నా ఇంకా పలు కాలనీలు బురదలో ఉన్నాయి. పునరావసకేంద్రాల్లో ఉంటూ తమ ఇండ్లను క్లీన్ చేసుకుంటున్నారు ప్రకాష్ నగర్ ప్రజలు. మున్నేరు వరద బీభత్సం మరవకముందే ఖమ్మం పట్టణానికి మళ్లీ గండం ముంచుకొస్తోంది.

ఖమ్మం మున్నేరు వాగుకు మళ్ళీ వరద సూచన చేశారు అధికారులు. ముందు జాగ్రత్తగా మున్నేరు పరివాహక ప్రాంతాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మహబూబాబాద్, గార్ల, బయ్యారం మండలాల్లో కురుస్తున్న భారీ వర్షానికి మున్నేరుకు క్రమంగా వరద పెరుగుతోంది. రాత్రికి మున్నేరు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. దీంతో మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రుల ఆదేశాలతో రంగలోకి దిగిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లోతట్టు ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మరోసారి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ పట్టణంలో భారీ వర్షం కురిసింది సాయంత్రం కురిసిన వర్షానికి మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ పూర్తిగా జలమయమైంది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ప్రజలంతా ఇండ్లకే పరిమితమైనారు.ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయాయి. వర్షం నిర్విరామంగా కురుస్తుండడంతో ఇప్పుడు ఏమవుతుందోననే ఆందోళనలో కాలనీవాసులు మహబూబాబాద్ ప్రజలు ఉన్నారు.కొద్దిరోజుల క్రితం వరదల వల్ల నష్టపోయిన ప్రజలు కోలుకోక ముందే మరొక తుఫాన్ రావడం జిల్లా ప్రజలను మనోవేదనకు గురి చేస్తున్నది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button