క్రైమ్

ఖేల్ ఖతం.. “దుకాణం బంద్” రాత్రికి రాత్రి బోర్డు తీసేసిన వైనం..!

  • ఖేల్ ఖతం.. “దుకాణం బంద్”
  • డాక్టర్ రంజిత్ సార్ ఎక్కడ..?
  • రాత్రికి రాత్రి బోర్డు తీసేసిన వైనం
  • కొత్తూరులో డాక్టర్ రంజిత్ కహాని
  • గిరిజన బాలిక అబార్షన్ కేసు వ్యవహారం

క్రైమ్ మిర్రర్, షాద్ నగర్ : గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలికను గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేసి చిక్కుల్లో పడ్డ కొత్తూరు మండల కేంద్రంలోని శ్రీనివాస క్లినిక్ వైద్యుడు వి. రంజిత్ పరారీలో ఉన్నాడు. కొత్తూరు కేంద్రంలో శ్రీనివాస క్లినిక్ పేరిట ఆసుపత్రి నిర్వహిస్తున్న డాక్టర్ రంజిత్ ఆయుర్వేదిక్ వైద్యుడిగా ఉన్నారు. అయితే శ్రీలక్ష్మి మెడికల్ షాప్ పేరిట అదే భవనంలో తెలివిగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. చెప్పేది మాత్రం ఆయుర్వేదం చేసేది మాత్రం అలోపతి వైద్యం. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎర్రకుంట తండా కు చెందిన ఒక గిరిజన మహిళ నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు జూకల్ ప్రాంతానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలికకు నమ్మించి గర్భం చేసిన వ్యవహారంలో కొత్తూరు సదరు బాలికను తీసుకువచ్చి అబార్షన్ చేశారు. దీంతో ఈ కేసులో ప్రధాన పాత్రధారుడైన కృష్ణారెడ్డి తో పాటు అక్రమంగా అబార్షన్ చేసిన డాక్టర్ రంజిత్ వ్యవహారం ఇప్పుడు చిక్కులో పడింది.

డాక్టర్ రంజిత్ క్లినిక్ ఇప్పుడు మూసేశారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఉన్న బోర్డును కూడా తీసేశారు. క్లినిక్ పేరిట ఉన్న బోర్డును రాత్రికి రాత్రి ఉన్నఫలంగా తీసివేయడం గమనార్హం. ప్రస్తుతం రంజిత్ పరారీలో ఉన్నాడు. రంజిత్ గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. అబార్షన్ చేసింది డాక్టర్ రంజిత్ తో పాటు ఇంకా మరో మహిళా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సదరు మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రంజిత్ ఎక్కడ ఉన్నారు? ఏమయ్యారు? పోలీసులు అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారా? లేక పరారీలో ఉన్నాడా తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button