తెలంగాణ

గణపతి రెడ్డి రాజీనామా.. తెలంగాణ ప్రభుత్వంలో కలకలం

తెలంగాణ ప్రభుత్వంలో కీలకశాఖను చూస్తున్న అధికారి రాజీనామా చేయడం సచివాలయంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆర్ అండ్ బి ఈఎన్సి పదవికి గణపతి రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కు అందజేశారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు(RRR) బాధ్యతలు చూస్తున్నారు గణపతి రెడ్డి.రీజనల్ రింగ్ రోడ్ కు NH నంబర్ కేటాయింపు,కేంద్రంతో సంప్రదింపుల్లో కీలకంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కొలిక్కి వస్తున్న సమయంలో ఈఎన్సి గణపతి రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ అంచనాలు పెంపు పై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ కారణంగానే గణపతి రెడ్డి రాజీనామా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 2017లో రిటైర్డ్ అయిన గణపతి రెడ్డిని ఏడేళ్లుగా కొనసాగించిన గత కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా గణపతి రెడ్డిని

9 నెలలుగా గణపతి రెడ్డినే ఈఎన్సిగానే కొనసాగించింది రేవంత్ రెడ్డి సర్కార్. గణపతి రెడ్డి ఆధ్వర్యంలోనే కొత్త సెక్రటేరియట్,ప్రగతిభవన్,పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్,జిల్లా కలెక్టరేట్లు,అమర జ్యోతి,125 అడుగుల అంబేద్కర్ విగ్రహం,మెడికల్ కాలేజీలు,పలు జాతీయ రహదారులు నిర్మాణం జరిగింది. అయితే నిర్మాణ దశలో ఉన్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,హైదరాబాద్‌లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ అంచనాలు పెంపు పై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపిస్తోంది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో గణపతి రెడ్డి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button