తెలంగాణరంగారెడ్డి
Trending

గౌడన్నతో రేవంతన్న… కాటమయ్య కిట్ల పంపిణీ

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తాటివనంలో కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాతూరి ప్రకాష్ గౌడ్ కి గుర్తింపు కార్డ్ అందచేశారు. గీత కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి సరదాగా మాట్లాడారు. రోజుకు 15 చెట్లు గీస్తే 45లీటర్ల కల్లు వస్తుందని ఓ వ్యక్తి చెప్పగా.. అందులో నీళ్లు ఏమైనా పోస్తున్నారా? అని సీఎం అడిగారు. అలా చేయబోమని కార్మికుడు నవ్వుతూ చెప్పారు. బెల్టు షాపుల దెబ్బ ఏమైనా పడిందా అని రేవంత్ ప్రశ్నించగా, అలాంటి దుకాణాలేవీ లేవని తెలిపారు. అలాగే కృష్ణయ్య అనే వ్యక్తి వేసుకున్న ఎల్లోషర్ట్ బాగుందని సీఎం కితాబునిచ్చారు.  తాటి వనాల పెంపును ప్రోత్సహించాలని సీఎంను గీత కార్మికులు కోరారు. ఇందు కోసం గ్రామంలో 5 ఎకరాలు కేటాయించాలన్నారు. తాటి వనాలకు వెళ్లేందుకు మోపెడ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రియల్‌ ఎస్టేట్‌ పెరగడం వల్ల తాటి వనాలు తగ్గుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వన మహోత్సవంలో భాగంగా తాటి చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం గీత కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు, స్థానిక శాసన సభ్యులు మల్ రెడ్డి రంగా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిలక మధుసూదన్ రెడ్డి,  పాల్గొన్నారు. ఇక పేదలకు కార్పొరేట్ విద్య, వైద్యం అందించాలని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను కాంగ్రెస్ తెచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ORR నిర్మాణాల వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగిందన్నారు. త్వరలోనే హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.

Related Articles

Back to top button