తెలంగాణనల్గొండ

చండూరులో కుక్కల స్వైర విహారంపై ప్రజాగ్రహం

చండూరులో కుక్కల స్వైర విహారంపై ప్రజాగ్రహం

చండూరు,క్రైమ్ మిర్రర్:
చండూరులో ఇటీవల కాలంలో కుక్కల స్వైర విహారం పెరిగిపోయింది. పిల్లలు పెద్దల్ని విచ్చలవిడిగా కరుస్తున్నాయి. కుక్కకాటుతో ఆసుపత్రికి వెళ్లే బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కుక్కల నివారణకై ప్రజాగ్రహం పెరుగుతావుంది. సోమవారం సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, బిజెపి కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కాసాల వెంకటరెడ్డి ప్రజలతో కలిసి తహశీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అలాగే కౌన్సిలర్లు అన్నపర్తి  శేఖర్, గుంటి వెంకటేశం మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు . మంచుకొండ సంజయ్ స్థానికులతో కలిసి వినతి పత్రం అందజేశారు.

కుక్క కాటు మరణాలు విచారకరం : కాసాల
రాష్ట్రంలో కుక్క కాటు మరణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని, దింతో బాదిత కుటుంబాలు ఎంతగానో రోదిస్తున్నాయని ఇది విచారకరమని సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి పేర్కొన్నారు. వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలంటూ చండూరు తహాశీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన ప్లకార్డు ప్రదర్శించి పలు గ్రామాల ప్రజలతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. ఆనంతరం డిప్యూటీ తహాశీల్దార్ దీపక్ కుమార్ కు వినతి పత్రం అందించి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలు తీస్తూ, ప్రాణాంతకంగా మారిన వీధి కుక్కలను నివారించుటకై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Related Articles

Back to top button