అంతర్జాతీయం
Trending

చంద్రబాబు ఖతర్నాక్ స్కెచ్.. తెలంగాణలో ఆ పార్టీ అవుట్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు శరవేగంగా పావులు కదుపుతున్నారు. 2028 నాటికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నయా జోష్‌ తెచ్చేందుకు అధ్యక్షుడి నియామకంతో పాటు.. తెలంగాణ బీజేపీతో పెత్తు పెట్టుకోవాలని డిసైడ్‌ అయ్యారట. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కలయికలో ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ కూడా ఇదే ఫార్ములాను అమలు చేయాలనే యోచనలో ఉన్నారట సీఎం చంద్రబాబు.

చంద్రబాబు హైదరాబాద్‌ పర్యటనలో టీ టీడీపీ నేతలతో బీజేపీతో కలిసి పోదామని చెప్పినట్టు తెలిసింది. త్వరలో జరిగే స్థానిక సంస్థలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్టు చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై కొద్దిరోజులు వేచి చూద్దామని చెప్పినట్టు తెలిసింది. పార్టీలో అందరికి ఆమోదయోగ్యమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారట.

గతంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్న సమయంలో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలకు లాభం జరుగుతుందని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం టీడీపీకి గ్రామగ్రామన బలమైన కేడర్ ఉంది. కానీ నాయకత్వం లోపించడంతో క్యాడర్ అంతా సైలెంట్‌గా ఉంది. ఇదే సమయంలో బీజేపీ వైపు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలిసి పనిచేస్తే తెలంగాణలోనూ మెజార్టీ స్థానాలు సాధించొచ్చని, పార్టీకి పునర్ వైభవం తీసుకురావడంతో పాటు బీజేపీకి సైతం కలిసి వచ్చే అవకాశం ఉందని బాబు భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలకు చెప్పినట్టు తెలిసింది.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో కట్టడి చేస్తే ఆటోమేటిక్‌గా బీజేపీ బలోపేతం అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారట. ఇప్పటికే బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు సైతం అంటున్నాయి. అటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ సైతం సీరియస్‌గా గాంధీ భవన్ వర్గాలు సీరియస్‌గా ఉన్నాయట. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణలో జెండా ఎత్తేసిన పార్టీ నాయకత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో తిరిగి పాగా వేస్తామంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని ప్రశ్నిస్తున్నారట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కనీసం ఎనిమిది నెలలు కూడా దాటలేదు.. అంతలోపే చంద్రబాబు మళ్లీ పాత పాట పాడటంపై నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.. మొత్తంగా టీడీపీ బలోపేతంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఎలా స్పందిస్తారో అని సొంత పార్టీ నేతలు కూడా ఎదురుచూస్తున్నారట..

Back to top button