జాతీయం

చనిపోదామని సముద్రంలోకి జంప్.. జుట్టుతో కాపాడిన క్యాబ్ డ్రైవర్

క్రైమ్ మిర్రర్, ఇన్ పుట్ ఎడిటర్ : కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన మహిళను ఓ క్యాబ్ డ్రైవర్ కాపాడాడు. ఆమె జట్టుపట్టుకుని మరీ రక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాకచక్యంతో మహిళ ప్రాణాలు కాపాడిన క్యాబ్ డ్రైవర్ కు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

ముంబైలోకి అటల్ సేతు బ్రిడ్జి మీద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ములుంద్ ప్రాంతానికి చెందినర రీమా ముఖేష్ అనే 56 ఏళ్ల మహిళ ముంబై అటల్ సేతువద్దకు వచ్చి కూర్చుంది. ఆమె ప్రవర్తన అనుమానంగా ఉండటంతో ఒక క్యాబ్ డ్రైవర్ గమనించాడు. ఆమె దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే అటల్ బ్రిడ్జీపైన కూర్చుని.. కొన్ని వస్తువుల్ని సముద్రంలో పాడేసింది. క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడుతునే.. ఒక్కసారిగా సముద్రంలో దూకేందుకు ప్రయత్నించింది. అతను వెంటనే.. సమయస్పూర్తిగా వ్యవహారించి యువతి జుట్టును పట్టుకున్నాడు.

Read More : క‌ర్నాట‌క కాంగ్రెస్ సీఎం అవుట్.. నెక్స్ట్ రేవంత్ రెడ్డేనా? 

ఆ తర్వాత ఆమె చేతులు పట్టుకుని, సముద్రంలోపడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో అక్కడ నుంచి వెళ్తున్నపెట్రోలింగ్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. సదరు మహిళను చాకచక్యంగా పట్టుకుని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చారు.ఆ తర్వాత అక్కడి నుంచి పీఎస్ కు తరలించారు.మహిళ సూసైడ్ కు మాత్రం గల కారణాలు తెలియరాలేదు.ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.శెభాష్ క్యాబ్ డ్రైవర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

Back to top button