ఆంధ్ర ప్రదేశ్

చేతకాకపోతే ఉద్యోగాలు వదిలేయండి.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో అలుపెరగకుండా తిరుగుతున్న సీఎం చంద్రబాబు అధికారులకు ఎక్కడిక్కకడ సూచనలు చేస్తున్నారు.సహాయక చర్యల్లో అధికారుల అలసత్వంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులందరికీ సరిపడేలా ఆహరం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జరుగుతోన్న జాప్యంపై సీరియస్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా తాను పర్యటిస్తున్నా .. అధికారులు మాత్రం ఇంకా గతంలోమాదిరి మొద్దు నిద్ర పోతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిరహించారు.. బాధితులకు అందుతున్న సహాయంపై ఆరా తీశారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో కొంతమంది అధికారుల తీరుతో ఆహారాన్ని సకాలంలో అందించడంలో ఆలస్యం అయిందని తెలుసుకున్న చంద్రబాబు .. ఉద్దేశపూర్వకంగా అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులుగా పేరొందిన కొంతమంది వీఆర్ లో ఉన్న అధికారులను బందోబస్తులో భాగంగా సహాయక చర్యలో భాగంగా విధులు నిర్వహించేలా డ్యూటీ వేశామని సీఎంకు ఉన్నతాధికారులు తెలిపారు.పని చేయడం ఇష్టలేకపోతే ఉద్యోగాలను వదిలేయాలని , ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఈ రాజకీయాలు ఏంటి..? వీటిని ఏమాత్రం సహించేది లేదంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

వరద బాధితులకు ఆహార పంపిణీలో ఎలాంటి జాప్యం జరగవద్దని.. పండ్లను కూడా అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు నీలల్లోకి దిగన్ జగన్.. ఇవాళ బురదలో దిగాడని సీఎం చంద్రబాబు అన్నారు. గుడ్లవల్లేరు ఘటనలో ఎంత పెద్ద వారున్నా వదిలేది లేదన్నారు. కొంతమంది క్రిమినల్స్ రాజకీయంలో ఉండకూడదన్నారు.అమరావతి మునిగిపోయింది అని ఎందుకు విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button