ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే? సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. దాదాపుగా దుకాణం క్లోజ్ చేసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఏపీలో అధికారం రావడంతో తెలంగాణపై ఫోకస్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెలలో రెండు సార్లు తెలంగాణ నేతలతో సమావేశం అవుతున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆదివారం తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కమిటీలను రద్దు చేశారు. త్వరలోనే సభ్యత్వ నమోదు చేపడుతామని.. అనంతరం కొత్త కమిటీలను వేస్తామని తెలిపారు. తెలంగాణలో పార్టీకి పునర్ వైభవం రావడం ఖాయమన్నారు చంద్రబాబు. తెలంగాణ పార్టీ పగ్గాలు ఓ బడానేతకు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు .

ఇక తెలంగాణ టీడీపీలోకి వలసులు మొదలయ్యాయి. మాజీ మంత్రి బాబు మోహన్ పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు సమావేశానికి వచ్చారు. ఆయన టీడీపీలో చేరినట్లే. ఆందోల్ నుంచి గతంలో టీడీపీ నుంచి గెలిచిన బాబు మోహన్.. చంద్రబాబు రెండో ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2014లో బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. కాని ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి ఆయన సొంతగూటికి చేరారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుతో ఆ ఎమ్మెల్యేలు చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. సమయం చూసుకుని ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు. సదరు ఎమ్మెల్యే మాత్రమే కాదు.. మరి కొంత మంది సీనియర్ నేతలు కూడా తిరిగి టీడీపీలోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. నిజానికి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ టీడీపీ బలంగా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. 2018లోనూ ఇద్దరు విజయం సాధించారు.

2023 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రేవంత్ రెడ్డి కోరిక మేరకే టీడీపీ బరి నుంచి తప్పుకుందనే టాక్ వచ్చింది. టీడీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ అభిమానులంతా రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాకా ఏపీ ఓటర్లు మొత్తం రేవంత్ వెనుక క్యారీ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు బలోపేతం చేస్తే.. ఆ ప్రభావం ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డిపైనే పడుతుందనే అభిప్రాయాలు రాజకీయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేస్తే తెలంగాణలో అనూహ్య ఫలితాలు వస్తాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button