ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలోకి వైసీపీ ఎంపీ జంప్.. జగన్‌కు ఊహించని షాక్

క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గతంలో జగన్ కు అత్యంత సన్నహితంగా ఉన్న మాజీ మంత్రి ఆళ్లనాని కూడా జగన్ కు హ్యాండిచ్చారు. ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి రోజా కూడా తన సోషల్ మీడియా ప్రోఫైల్స్ లో వైసీపీ, జగన్ ఫోటోలు తీసేశారు. ఇక వైసీపీకి చెందిన ద్వితియ శ్రేణి లీడర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీడీపీ లేదా జనసేన గూటికి చేరుతున్నారు. తాజాగా జగన్ కు మరో బిగ్ షాగ్ తగలనుందని తెలుస్తోంది.

వైసీపీకి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణా రావు గుడ్‌బై చెప్పనున్నారని సమాచారం. వైసీపీకి రాజీనామా చేయాలని మోపిదేవి వెంకట రమణా రావు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే టీడీపీలో మోపిదేవి వెంకట రమణా రావు చేరే అవకాశం ఉందంటున్నారు. గన్నవరం విమానాశ్రయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ.. అక్కడే తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీ పదవికి కూడా మోపిదేవి రాజీనామా చేయనున్నారు. తర్వాత జరిగే ఉప ఎన్నికలో టీడీపీ నుంచి ఆయననే మళ్లీ రాజ్యసభకు పంపిస్తారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీ ఒక్క సభ్యుడు కూడా లేరు. ఇప్పుడు మోపిదేవితో టీడీపీకి రాజ్యసభలో స్థానం దక్కనుంది. అందుకే మోపిదేవికి చంద్రబాబు గాలం వేశారంటున్నారు.

మోపిదేవి వెంకటరమణ వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు జైలుకు వెళ్లాడు. అందుకే 2019 ఎన్నికల్లో రేపల్లిలో మోపిదేవి ఓడిపోయినా.. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. తర్వాత శాసనమండలిని రద్దు చేయాలని భావించి వాళ్లిద్దరితో రాజీనామా చేయించారు. మంత్రిపదవి నుంచి తొలగించి రాజ్యసభకు పంపించారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మోపిదేవి.. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతుండటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button