తెలంగాణరంగారెడ్డి

డేంజర్.. వాటర్.. మిషన్‌ భగీరథ నీటీలో వానపాములు…!!

క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మిషన్‌ భగీరథ తాగునీరు సరఫరా డేంజర్‌గా మారింది.ఇంటింటికి చేసిన సరఫరాలో వానపాములు దర్శనమిచ్చాయి. ఈ సంఘటన శనివారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని శాంతినగర్‌ ప్రాంతంలో సరఫరా అయిన మిషన్ భగీరథ నీటిలో వాన పాములు, జెర్రిలు కనిపించాయి. గమనించిన స్థానికులు బెంబేలెత్తిపోయారు.వాన పాములు ఉన్న నీటిని సరఫరా చేస్తే ఎలా తాగేది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలోని పలు ప్రాంతాల్లో లీకేజీలు కావడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేస్తున్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు లీకేజీ వల్ల నుంచి వానపాములు, జెర్రీలు పైపులైన్‌లలో చేరి కుళాయిలకు సరఫరా అవుతున్నాయని అంటున్నారు. లీకేజీల మరమ్మత్తులు అధికారులు నిర్లక్ష్యం వల్లే డేంజర్ వాటర్ సరఫరా అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ!!
  2. చండూరు సంతలో రెచ్చిపోతున్న సెల్ ఫోన్ దొంగలు…
  3. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రేవంత్ సర్కార్‌పై మండిపడిన కేటీఆర్!!!
  4. కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు… ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ!!

 

Related Articles

Back to top button