తెలంగాణ

డ్రైనేజీ నీటితో ప్లేట్లు, గ్లాసుల క్లీనింగ్.. హైదరాబాద్ హోటల్స్ లో దారుణం

వర్షం పడుతుందని గరంగరం ఛాయ్ కోసం హోటల్ కు వెళుతున్నారా.. వేడివేడి టిఫిన్ కోసం కావాలని పెద్ద హోటల్ చూసుకుని వెళుతున్నారా.. భోజనం కూడా హోటల్స్ లోనే చేస్తున్నారా.. అయితే మీకో షాక్ంగ్ న్యూస్.. రేపోమాపో మీరు హాస్పిటల్ లో అడ్మిట్ కావడం గ్యారెంటీ.. హోటల్ కు వెళ్లి ఫుడ్, టీలు తీసుకున్నారా ఇక మీ ఖర్మ అంతే..

అవును మీరు చదివింది నిజమే. హైదరాబాద్ హోటల్స్ లో దారుణాలు జరుగుతున్నాయి.డ్రైనేజీ నీటితోనే లంచ్ ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతున్నారు. యూసుఫ్ గూడ లోని శ్రీ కృష్ణ ఉడిపి పార్క్ హోటల్ సిబ్బంది డ్రైనేటీ నీటితో ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుతుండగా చూసిన ఓ వినియోగదారులు తన ఫోన్ తో చిత్రీకిరంచాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన హైదరాబాదీలు షాకవుతున్నారు.

ఈ ఉడిపి హోటల్ లో కొన్నాళ్లుగా పైపుల్లో డ్రైనేజీ లీకవుతోంది. అయినా పట్టించుకోకుండా హోటల్ యాజమాన్యం డ్రైనేజీ నీటితోనే హోటల్లోని ప్లేట్లు, గిన్నెలు, టీ కప్పులు కడిగిస్తున్నారు. ఆ ప్లేట్లలోనే వినియోగదారులకు మీల్స్, టిఫిన్స్, టీ సర్వ్ చేస్తున్నారు. ఒక్క యూసుఫ్ గూడ ఉడిపి హోటలే కాదు నగరంలోని చాలా హోటల్స్,రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. అసలే వర్షాకాలం. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో జనం అల్లాడిపోతున్నారు. వరదలో వాటర్ పొల్యూట్ అయి జనాలు విషజ్వరాల భారీన పడుతున్నారు. ఇప్పుడు హోటల్స్ లో కూడా డ్రైనేజీ నీటితో కడిగిన ప్లేట్లు, గ్లాసులు వాడుతుండటంతో నగరవాసులు రోగాల భారీన పడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button