తెలంగాణ
Trending

ఢిల్లీలో హరీష్ రావు.. కవిత బెయిల్ కోసం టాక్స్!

క్రైమ్ మిర్రర్, న్యూ ఢిల్లీ : తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ అయ్యారు. రెండు రోజుల క్రితం జైలులో అనారోగ్యానికి గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఆమెకు చికిత్స చేశారు. జైలులో కవితిను కలిసి హరీష్ రావు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. హరీష్ రావుతో పాటు కవితను కలిశారు ఎంపీ రవిచంద్ర. ఈనెల 27న లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం. ఢిల్లీకి వెళ్లిన హరీష్ రావు.. కవిత బెయిల్ కు సంబంధించి న్యాయవాదులతో చర్చలు జరిపారు.

ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కవితకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ఇక లిక్కర్ స్కాం కేసులో ఇటీవలే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ నుంచి కేసులో పురోగతి లేదని కామెంట్ చేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

Related Articles

Back to top button