తెలంగాణ

ఢిల్లీలో 26 మంది BRS ఎమ్మెల్యేలు..బీజేపీతో కేటీఆర్, హరీష్ డీల్స్?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా హస్తినకు వెళ్లారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ మినహా గులాబీ పార్టీలోనే పెద్దలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. అంతేకాదు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నలుగురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు కూడా దేశ రాజధానిలో ఉన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కేటీఆర్, హరీష్ రావు ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లారు.. అక్కడ ఏం చేస్తున్నారు.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నందున.. ఆమెను రిసీవ్ చేసుకోవడానికే ఢిల్లీకి వెళ్లామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నా.. రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జోరుగా సాగుతోంది.

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో బలం 38కి తగ్గింది. 10 ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కు మిగిలిన ఎమ్మెల్యేలు 28. ఇందులోనూ చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారనే టాక్ వస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కు సవాల్ గా మారింది. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు మళ్లకుండా చూడాలన్న ఎత్తుగడా.. లేక మరేదైనా ఉందా అన్నది చర్చగా మారింది.

కవితకు బెయిల్ రాకుంటే కేటీఆర్ ఎమ్మెల్యేలతో ఢిల్లీలోనే మకాం వేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ మరో ఆలోచనతో ఉన్నారని.. బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ 26 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలను చూపించి బీజేపీ పెద్దలతో కేటీఆర్ బేరాలు ఆడుతున్నారని అంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఢిల్లీ టూర్ ఎన్నో అనుమానాలకు కేంద్రంగా మారింది. మరీ ఢిల్లీలో ఏం జరుగుతోందో చూడాలి మరీ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button