తెలంగాణ

తెలంగాణకు మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్: తెలంగాణలో మరో నాలుగు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) అనుమతి ఇచ్చింది. ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేటలో ఈ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి ఒక్కో కాలేజీలో 50 సీట్లతో ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టనుంది.

ఇటీవల బదిలీలు చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖ.. ఈ నాలుగు కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది. దీంతో ఈ నాలుగింటికి కూడా అనుమతులు మరోసారి జాతీయ వైద్య కమిషన్‌కు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దిష్ట గడువులోగా లోపాలను సరిదిద్దుకుని, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని, అనుమతులు మంజూరుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి హామీ పత్రాలను సమర్పించనున్నారు.

ప్రస్తుతం తెలంగాణలోని 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,915 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా నాలుగింటికి అనుమతులు లభించడంతో అదనంగా 200 సీట్లు పెరుగుతాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 4,115కు చేరుకోనున్నాయి.రాష్ట్రంలో ప్రైవేటుతో కలిపి మొత్తం 56 వైద్య కాలేజీల్లో 8,515 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.

ఈ ఏడాది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ యూపీ పరీక్షా పత్రం లీక్, అవకతవకలు
జరిగినట్టు ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది. జులై మొదటి వారంలో జరగాల్సి కౌన్సిలింగ్ కూడా దీని వల్ల వాయిదా పడింది. ఆగస్టు రెండో వారంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది.

Related Articles

Back to top button