తెలంగాణహైదరాబాద్

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ సన్నాహక సమావేశం.. ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జీహెచ్‌ఎంసీ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్‌రెడ్డి సమావేశానికి హాజరుకాలేదు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు వివేకా, లక్ష్మారెడ్డిలు సమావేశానికి రాలేమని ముందస్తుగా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మీటింగ్‌కు మొత్తం 35మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు హాజరయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. ఈ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Read Also : సేవా స్ఫూర్తిని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్

రేపటి జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశించింది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి వైదొలకాలని కౌన్సిల్‌ మీటింగ్‌లో బీఆర్ఎస్ డిమాండ్‌ చేయనుంది. కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ డిసెంబర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదిలా ఉంటే ఇప్పటికే మేయర్‌, డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ కండువాతీసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఇవాళ బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్వహించిన ఈ సమావేశం కీలకంగా మారింది. ఎవరు హాజరవుతారు? ఎవరు హాజరు కావడం లేదనే ఉత్కంఠకు తెరపడింది. ఈ కీలక సమావేశంలో ఐదు మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం తీవ్రచర్చకు దారితీసింది. వీరిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి మరి.

ఇవి కూడా చదవండి : 

  1. హైదరాబాద్‌ శివారులో పోలీసుల కాల్పులు.. నలుగురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్
  2. బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు!!
  3. విద్యుత్ షాక్ తో మహిళ మృతి.. అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు!!
  4. జులై 6 న సంగారెడ్డి కి డా. విశారాధన్ మహారాజ్…
  5. ఫ్రీ బస్సు పథకం వల్ల టీజీఎస్ఆర్టీసీకి 2500 కోట్ల నష్టం.. ఒక్క పైసా కూడా ఇవ్వని సర్కార్!!

Related Articles

Back to top button