ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ
Trending

తెలుగు రాష్ట్రాలకు నేడు బిగ్‌ డే.. ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల సీఎంల ఫస్ట్‌ మీటింగ్‌లో జరిగేదేంటి?.. విభజన సమస్యలకు చెక్‌ పడుతుందా? జలాలవాటా నుంచి ఆస్తుల పంపకాల దాకా.. అన్ని కొలిక్కి వస్తాయా..?.. అనేది.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. రెండు రాష్ట్రాల విభజన అంశాలను తేల్చేయడానికి ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చర్చించబోతున్నారు. ఇదివరకటి ముఖ్యమంత్రుల సమావేశానికి, ఈ సమావేశానికి ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లయిపోయింది. అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన.. పంపకాలు మాత్రం పూర్తి కాలేదు.

Read Also : 10 ఎకరాల లోపు రైతులకే రైతు భరోసా?.. ముగిసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

తాజాగా, ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అవుతుండటం తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా విభజన అంశాలపై చర్చించుకుందామంటూ… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం.. మళ్లీ రేవంత్ రెడ్డి చర్చించుకుందామంటూ చంద్రబాబుకు లేఖ రాయడం చకచకా జరిగిపోయాయి.. ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజాభవన్ లో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా.. పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకోవాలని చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.

Also Read : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ.. ఆమె జుడీషియల్ కస్టడీని పొడగించిన రౌస్ అవెన్యూ కోర్ట్!!

తొలిసారి విభజన అంశాలపై చర్చించేందుకు ప్రజాభవన్‌లో సాయంత్రం 6గంటలకు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశంకానున్నారు.. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్, ఇరు రాష్ట్రాల్లో సీఎస్‌లు, పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శుల హాజరవుతారు. కాగా.. ఇవాళ సాయంత్రం ప్రజా భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి డిన్నర్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు సమావేశంలో పాల్గొనే వారికి కూడా డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈఓ)గా సుదర్శన్ రెడ్డి
  2. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ సన్నాహక సమావేశం.. ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా!!
  3. సేవా స్ఫూర్తిని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్
  4. హైదరాబాద్‌ శివారులో పోలీసుల కాల్పులు.. నలుగురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్
  5. టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం.. పోలీసుల అత్యుత్సాహం, సాధారణ ప్రజలను సైతం అదుపులోకి !!

Related Articles

Back to top button