తెలంగాణనల్గొండ

పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..

చండూరు, క్రైమ్ మిర్రర్: చండూరు మండలంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి సైదులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలో చండూరు గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు కార్యదర్శిగా పనిచేశారు. అయితే కొందరు జర్నలిస్టులకు ఇటీవల కాలంలో పాత తేదీల మీద తప్పుడు యాజమాన్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ కట్ట బిక్షం  ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. డిఎల్పిఓ  విచారణ నివేదికను కలెక్టర్కు సమర్పించారు. దీనితో  కార్యదర్శి సైదులును  జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సదరు జర్నలిస్టులు చేసుకున్న ప్లాట్ల  రిజిస్ట్రేషన్ లను  చండూరు ఆర్డివో హోల్డింగ్ లో పెట్టించారు.

కాగా  లక్షల రూపాయలు విలువ చేసే ప్లాట్ లను వెంటనే మున్సిపాలిటీ వారు స్వాధీనపర్చుకొని  ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలని,  అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ కట్ట బిక్షం డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ల బాగోతం పై  ఉన్నత అధికారుల ద్వారా విచారణ  చేయించాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Back to top button