తెలంగాణ

పండబొట్టి తొక్కుతా..కేసీఆర్‌ను కలుస్తా.. తీన్మార్ మల్లన్న సంచలనం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా నిలిచిన తీన్మార్ మల్లన్న మరోసారి హాట్ హాట్ గా మారాయి. కొన్ని రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న తీన్మార్ మల్లన్న బీసీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే భూకంపం స్పష్టిస్తానని ప్రకటిస్తున్నారు. అంతేకాదు అధికార అహకారంతో రెడ్డి లీడర్లు విర్రవీగుతున్నారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు తీన్మార్ మల్లన్న. బీసీల కోసం తన పదవి పోయినా పర్వాలేదంటూ సంచలన కామెంట్లు చేస్తున్నారు. బీసీల ఓట్లతో గెలిచిన తాను.. ఆ వర్గాల కోసమే పోరాడుతానని చెబుతున్నారు.

బీసీల కోసం తనని జైలులో పెట్టిన కేసీఆర్ దగ్గరకు కూడా వెళ్తానని చెప్పారు తీన్మార్ మల్లన్న. బీసీలను అణగదొక్కాలని చూస్తే పండబెట్టి తొక్కుతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న మూడు నెలల్లోనే కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అదే సమయంలో తీన్మార్ మల్లన్నకు పార్టీలకు అతీతంగా బీసీల నుంచి మద్దతు పెరుగుతోంది. తమకు బలమైన నేత వచ్చారని బీసీ వర్గాలు సంబరపడుతున్నాయి. అయితే మలన్న ఇంతగా మారిపోవడానికి కారణం ఏంటీ.. బీసీ వాయిస్ ఎందుకు ఎత్తుకున్నారు.. మల్లన్న తీరుపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం రాష్ట్రమంతా ప్రచారం చేశారు తీన్నార్ మల్లన్న. కాంగ్రెస్ కు మద్దతుగా బీసీలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. అందుకే ఆయనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు వచ్చింది. అయితే ఎన్నికలో మల్లన్నకు కాంగ్రెస్ నేతలంతా సహకరించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెడ్డి లీడర్లు తీన్మార్ మల్లన్నకు ఓడించాలని చూశారని సమాచారం. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోలింగ్ కు ఐదు రోజుల ముందు అమెరికా వెళ్లారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు మల్లన్న ఎన్నికను పట్టించుకోలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనను ఓడించే కుట్ర చేశారని మల్లన్న బహిరంగంగానే చెబుతున్నారు. చివరి నిమిషంలో బీసీ పట్టభద్రులు అప్రమత్తం కావడం వల్లే తాను గెలిచానని చెబుతున్నారు మల్లన్న. అందుకే తన కోసం పని చేసిన వర్గాల కోసం పోరాడుతానని.. తనను ఓడించాలని చూసిన నేతల అంతం చూస్తానని శపథం చేస్తున్నారు.

మరోవైపు బీసీ వర్గాల కోసం ప్రస్తుతం పని చేస్తున్న సంఘాలు విశ్వసనీయత కోల్పోయాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పార్టీకి వంతపాడుతూ పబ్బం గడుపుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. EWS రిజర్వేషన్లతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదు. ఇక ఈ విషయంలో తీన్మార్ మల్లన్న బలంగా పోరాడుతున్నారు. తన చానెల్ తో పాటు బహిరంగ వేదికలపైనా EWS రిజర్వేషన్లతో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారు. దీంతో బీసీలంతా తీన్మార్ మల్లన్న వైపు క్యారీ అవుతున్నాయి. మల్లన్నబీసీ వాయిస్ తో ముందుకు పోతే వచ్చే ఎన్నికల నాటికి ఆయన బలమైన నేతగా నిలుస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button