తెలంగాణవరంగల్

పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి – ఎస్ఎస్ఏ, సాంబయ్య

క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప) : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఎంపిపిఎస్ ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎస్ఏ జిల్లా కో ఆర్డినేటర్ సాంబయ్య హాజరై మాట్లాడారు.. ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా హాజరవ్వాలని, ఈ మీటింగ్ వల్ల తమ పిల్లల చదువు స్థితిగతులు, పిల్లల క్రమశిక్షణ తెలుసుకోవచ్చని, పిల్లల సమస్యలు, విద్య విధానం ఎలా ఉందో తెలుసుకోవచ్చని అన్నారు.

Read More : విలీనంపై మాట్లాడని కేసీఆర్,హరీష్.. రేవంత్ చెప్పిందే నిజమా!

ఇంట్లో తమ పిల్లలను క్రమశిక్షణలో ఉంచాలని, వారికి చదువుకునే సమయాన్ని కేటాయించాలని, పిల్లలను ఎల్లవేళలా గమనిస్తూ ఉండాలని, తప్పుడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్త పడాలని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండేలా చూసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఏపిసి ఎంపిపిఎస్ చైర్మన్ పోలం రాధిక, ఉపాధ్యాయులు బాబురావు, అంబేద్కర్, కిరణ్ కుమార్, ఫేరోజ్, సంధ్యారాణి, రమేష్, రాజయ్య, లావణ్య, స్వప్న, స్రవంతి, సిఆర్పీ కుమార్ పాడ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button