తెలంగాణ
Trending

బిగ్ బాస్ షో నుంచి నాగార్జున అవుట్?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : టాలీవుడ్ టాప్ హీరో నాగార్జునకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాదాపూర్ తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ.. నాగార్జున కట్టిన పలు నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ఘటనతో నాగార్జున పరువు రోడ్డున పడింది. వందల కోట్ల రూపాయలు సంపాందించిన నాగార్జున.. కక్కుర్తితో చెరువును ఆక్రమించారనే విమర్శలు వస్తున్నాయి. హైడ్రా దెబ్బకు రోడ్డున పడ్డ నాగార్జనకు మరో గండం వచ్చి పడింది. బిగ్ బాస్ షో నుంచి నాగార్జునను తొలగించాలనే డిమాండ్ వస్తోంది. అక్రమంగా చెరువును కబ్జా చేసిన నాగార్జునను షో నిర్వాహకులే ఎలిమినేట్ చేయాలనే వాదన వస్తోంది.

Read More : కోమటిరెడ్డి అనుచరుడిని తన్ని తరిమేసిన జనాలు!

బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న బాబు గోగినేని ఓపెన్ గానే నాగార్జునను టార్గెట్ చేశారు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ హిం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. చెరువును కబ్జా చేసిన నాగార్జున లాంటి వారికి బిగ్ బాస్ షోను హోస్ట్ చేసే అర్హత లేదన్నారు బాబు గోగినేని. నిర్వాహకులే నాగార్జునను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే షో పార్టిషిపెంట్స్, వీక్షకలు ఓటింగ్ ద్వారా నాగార్జునను ఎలిమినేట్ చేయాలని బాబు గోగినేని కోరారు. నాగార్జునను బిగ్ బాస్ షో నుంచి తీసేయాలంటూ బాబు గోగినేని చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయనకు మద్దతుగా పలువురు పోస్టులు పెడుతున్నారు. నాగార్జునను ఎలిలినేట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నాగ్ కు సపోర్ట్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button