తెలంగాణ

బిడ్డా ఎట్లున్నవ్.. 6 నెలల తర్వాత కవితతో కేసీఆర్ భావోద్వేగం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవిత 164 రోజుల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో జైలు గేటు నుంచి బయటికి వచ్చిన కవిత.. రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. తనను జైలు వద్ద రిసీవ్ చేసుకున్న అన్న కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి తెలంగాణ భవన్ లో కాసేపు ఉన్నారు. బుధవారం ఉదయం ట్రయల్ కోర్టుకు వెళ్లి సంతకం చేసిన తర్వాత హైదరాబాద్ రానున్నారు కవిత. కేటీఆర్, హరీష్ రావులు కవిత తీసుకుని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కానున్నారు. కవితకు గ్రాండ్ వెల్ కం చెప్పేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ర్యాలీగా రానున్న కవిత.. ఆ తర్వాత తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తారని తెలుస్తోంది. కూతురు కవితను కేసీఆర్ చూడక దాదాపు 6 నెలలవుతుంది. మార్చి తొలివారంలో కేసీఆర్ ను కలిశారు కవిత. మార్చి 15న ఆమెను ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లింది. మార్చి 16న తీహారు జైలుకు వెళ్లింది. అయితే కవిత దాదాపు 6 నెలలు జైలులో ఉన్నా కేసీఆర్ మాత్రం వెళ్లి చూసి రాలేదు. బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రి చూసిరాకపోవడంపై పలువురు విమర్శలు చేశారు. అయినా కేసీఆర్ మాత్రం బిడ్డ దగ్గరికి వెళ్లలేదు. కవిత అరెస్టుపై గూడా ఎక్కువగా మాట్లాడలేదు. లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో ఒకటి రెండు సార్లు స్పందించారు. లిక్కర్ స్కాం బోగస్.. తన బిడ్డ కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని కామెంట్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులు మాత్రం చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి జైలులో కవితతో ములాఖత్ అయ్యారు. న్యాయవాదులతోనూ మాట్లాడారు. అయితే సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేసీఆర్ ఫోన్ లో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలైన కవిత తండ్రిని చూసేందుకు వస్తున్నారు. కేసీఆర్ ను చూశాకా కవిత ఎలా రియాక్ట్ అవుతుంది.. 6 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ ఎలా ఉంటారు అన్నది ఆసక్తిగా మారింది. జైలు నుంచి బయటికి రాగానే కొడుకు, భర్త, అన్న కేటీఆర్ ను ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు కవిత. తర్వాట మీడియాతో మాట్లాడుతూ కూడా కన్నీళ్లతో మాట్లాడారు. తనను అన్యాయంగా జైలులో పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆరు నెలల జైలు జీవితం తర్వాత తండ్రి కేసీఆర్ ను కలవనున్న కవిత.. ఏం చేస్తారోనని ఎంతా ఎదురు చూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button