రంగారెడ్డి

రావిర్యాలలో భూమి కొన్నది గోరంతా కబ్జా చేసేది కొండంత..?

  • పోర్జరీ చేసి కొన్నది 5 ఎకరాలు కబ్జా చేయాలనుకున్నది16 ఎకరాలు
  • తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదిలేదు —నిమ్మ రవిందర్ రెడ్డి
  • సరైన పత్రాలతో ఎక్కడికైనా రావడానికి నేను సిద్దమే — సవాల్ విసిరిన నిమ్మ రవిందర్ రెడ్డి

మహేశ్వరం ప్రతినిధి(క్రైమ్ మిర్రర్) : మహేశ్వరంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో భు వివాదాలు తలెత్తుతున్నాయి తాజాగా మహేశ్వరం మండలంలోని రావిర్యాల రెవెన్యూ పరిధిలో కొంగరకుర్ధు బి లొ రావిర్యాల గ్రామానికి చెందిన నిమ్మ రవిందర్ రెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి సర్వే నంబర్లు మర్చి కబ్జాలకు పాల్పడుతున్నాడని ఓ యు ట్యూబ్ ఛానెల్ లొ ప్రసారం చేయగా వెంటనే తనపై వస్తున్నా ఆరోపణలు ఖండిస్తూ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు ఈ సందర్బంగా మాట్లాడుతూ.2009 లొ సయ్యద్ షా రాజు హుస్సేన్ దగ్గర మొదట 4ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేసాను 2010 లొ కొనుగోలు చేసిన భూమి చుట్టూ కడిలు వేసి ఇనుప తారువైరును వేసానని తెలిపారు. 2015లొ సయ్యద్ షా రాజు హుస్సేన్ చనిపోయిన తరువాత అతని వారసులైన సయ్యద్ నాదీముల్లా ఉస్సేన్, సయ్యద్ షా ఉబుల్ ఉద్దీన్, కూతురు సైదా ఫరీసా లతో 2016 వ సంవత్సరంలో కొంగర కుర్డు (బి)సర్వే నంబర్ 27,17లొ మొత్తం కలిపి 13ఎకరాల భూమిని కొనుగోలు చేసానని నిమ్మ రవిందర్ రెడ్డి డాక్యుమెంట్లను విలేకరులకు చూపడం జరిగింది.

కానీ 2009లొ ఆచ్చిన మల్లేష్, తండ్రి కొమురయ్య,షేక్ షహలి ఉస్సేన్,దగ్గర 5 ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆచ్చిన మల్లేష్ కొనుగోలు చేసాడు.అంతకు ముందే స్వంత పట్టాదారు ఐన సయ్యద్ షా రాజు ఉస్సేన్ దగ్గర నిమ్మ రవిందర్ రెడ్డి 4 ఎకరాల 20 గుంటల భూమిని కొనుకోలు చేసారు 2010 లొ రవిందర్ రెడ్డి పొలానికి వేసుకున్న కంచెను అచిన మల్లేష్ ఇట్టి భూమిని నేను కొనుగోలు చేసానని ఇదినాకు సంబంధించినదని నా భూమిలో మీరు ఎలా కంచె వేస్తారని తొలగించడం జరిగింది అప్పుడు పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు. 2017లొ కోర్టులో జెర్జ్ మెంట్ రవిందర్ రెడ్డి వైపు రాగ ఫోర్జరీ చేసి భూమిని విక్రాయించిన షహలి హుస్సేన్ తోపాటు నలుగురికి 1,88,630 రూ,జరిమానాతో పాటు తిరిగి నాలుగు నెలల్లోనే భూమిని వారికీ అప్పచెప్పాలని కోర్టు ఆర్డర్ వేసింది, జైలు శిక్ష కుడా విధించ్చిందని తెలిపారు.తిరిగి అచిన మల్లేష్, హై కోర్టులో ఆపిల్ చేయగా కేసు నడుస్తుందని తెలిపారు. 2009 నుండి గుట్టలు రాళ్లు ఉన్న భూమిని వదిలిపెట్టి ఒక ఎకరం భూమిని చదును చేసి ఆక్కడ పంటలు కూడ వేసానని రవిందర్ రెడ్డి పేర్కొన్నారు.

గత రెండురోజుల క్రితం కొంగర కుర్డు, బి,27సర్వేనంబర్ లొ ఉన్న భూమిని చదును చేసే సమయంలో అచిన మల్లేష్, కొంతమందిని తీసుకోచ్చి నాపైకి రాళ్లతో దాడి చేయించారని తెలిరు అతనికి సంబంధం లేని సర్వే నంబర్ కొంగర కుర్డు బి 27లొ వచ్చి డౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేసాడు.అంతే కాకుండా అచిన మల్లేష్ అతని బావమరిది నోటికివచ్చినట్టుగా అసభ్య పదజాలాలతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు, ఇకపై నాపై తప్పుడు సమాచారమిచ్చి నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button