ఆంధ్ర ప్రదేశ్

రాసలీలలతో అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

ఏపీలో రాజకీయ నేతలు రొమాన్స్ వీడియోలతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఎమ్మెల్సీలు అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ వీడియోలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా మరో ఎమ్మెల్యే రొమాంటిక్ టేప్స్ కలకలం రేపుతున్నాయి. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు సంబంధించిన సీక్రెట్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మత్తు మందు ఇచ్చి తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలి ఆరోపిస్తోంది. చెల్లి, చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని చెబుతోంది. తనపై చేసిన అఘాయిత్యానికి పాల్పడిన వీడియోను బాధితురాలు రిలీజ్ చేసింది.

ఎమ్మెల్యే అత్యాచారం ఆరోపణలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇలాంటి నీచమైన పనులు చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబుకు బాధితురాలు లేఖ రాశారు. విషయం చెబితే తనను చంపేస్తానని బెదిరించారని వాపోయారు. ఆదిమూలం అరాచకాలు బయటపెట్టేందుకే వీడియో రిలీజ్ చేశానని చెప్పారు. ఆదిమూలం వల్ల ఎంతో మంది మహిళలు బాధపడుతున్నారని తెలిపారు.

2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. సత్యవేడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తనపై కావాలనే కొందరు కుట్ర చేసి ఇరికించారని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button