తెలంగాణ

రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీకు డబ్బులు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలన్ని రైతు రుణమాఫీ చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల లోపు రైతు పంట రుణాలు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెప్పారు. అయితే చాలా గ్రామాల్లో రుణమాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. 31వేల కోట్ల ఖర్చు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం 18 వేల కోట్ల మాత్రమే మాఫీ చేసిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తోంది. మొత్తంగా 50వేల కోట్ల రూపాయలు రైతులు రుణంగా తీసుకున్నారని.. రేవంత్ సర్కార్ కేవలం 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసి సంపూర్ణంగా చేశామని ప్రకటిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కడంతో ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. తమకు కలిసివస్తుందని భావించిన రుణమాఫీతో నష్టం జరిగే అవకాశాలు ఉండటంతో నష్ట నివారణ చర్యలకు దిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మీడియా సాక్షిగా రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందరికీ రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. ప్రతిపక్షం దుష్ర్పచారం చేస్తోందన్న మంత్రులు… అర్హులైన అందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

Read More : కవితకు బెయిల్ ఇప్పిస్తున్న సీఎం రేవంత్ లాయర్! 

కొందరు రైతులకు రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను మంత్రులు వివరించారు.అప్ డేట్ డేటా ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశామని. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానివారికి త్వరలోనే రుణమాఫీ అవుతుందని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. లక్షా 20 వేల ఖాతాల ఆధార్ నెంబర్ లు సరిగా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగిందన్నారు మంత్రులు. లక్షా 61 వేల అకౌంట్ లలో ఆధార్ కు పాస్ బుక్ పేరు కు మిస్ మ్యాచ్ ఉందన్నారు. లక్షా 50 వేల అకౌంట్ ల లో బ్యాంకు తప్పిదాలు ఉన్నాయన్నారు. 4 లక్షల 83 వేల అకౌంట్ లకు రేషన్ కార్డు లేని ఖాతాల వెరిఫికేషన్ చేయాల్సి ఉందని వెల్లడించారు. 8 లక్షల అకౌంట్ లకు 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఎక్కువ ఉన్నాయన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Related Articles

Back to top button