తెలంగాణ

రుణమాఫీ నిధులు విడుదల.. రైతువేదికల వద్ద సంబురాలు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారమే రైతు రుణమాఫీని విడుదల చేశారు. ఈరోజు( గురువారం) తెలంగాణ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించారు.
సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేల కోట్లు జమ చేసినట్లు వివరించారు. నిధులు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు రైతువేదికల వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నెలాఖరుకు లక్షన్నర రూపాయలు, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది.

Read Also : వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్.. పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశాలు

రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రుణమాఫీ నిధులను వేరే అప్పులకు జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల రుణమాఫీ పథకం వర్తిస్తుందని చెప్పారు. కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకుంటామని, రేషన్‌ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాగా.. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫేస్‌ -1 కింద 18న రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేస్తుండటంతో ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణమాఫీ నగదు జమ చేయడంతో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read : వ్యాసమహర్షి పురస్కారాలకు చండూరు వాసుల ఎంపిక..

రైతు కుటుంబాన్ని గుర్తించడానికి ఆహార భద్రతాకార్డు వివరాలు ప్రామాణికంగా రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న షెడూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకారం కేంద్ర బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తించనుంది. పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక నోడల్‌ అధికారిని నియమించగా, ఆ అధికారి నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌కు సమన్వ యకర్తగా వ్యహరించనున్నారు. డిసెంబరు 12, 2023 నాటికి రైతుకు ఉన్న రుణం, లేక రెండు లక్షల వరకు ఏది తక్కువైతే దాన్ని పొందేందుకు రైతులు అర్హులు. అలాగే రెండు లక్షల మించిన రుణం ఉన్న రైతులు ఆపైన ఉన్న రుణాన్ని మొదట చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన ఉండగా, ఆ తరువాతనే రుణమాఫీ పొందే వెసులుబాటు కల్పించింది.

ఇవి కూడా చదవండి : 

  1. రైతు రుణమాఫీ నిధులు విడుదల.. సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
  2. లంబాడ ఐక్యవేదిక ములుగు పట్టణ కమిటీ ఎన్నిక..
  3. లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్.. కేటీఆర్ ఆగ్రహం.. ఎస్‌ఐపై బదిలీవేటు!!
  4. డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ.. తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా
  5. అక్క భర్తను లవ్ చేసిన యువతి.. వద్దని చెప్పిన తల్లిదండ్రులు..చివరకు!!!

Related Articles

Back to top button