ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

ఇవాళ సాయంత్రం శ్రీశైలం గేట్ల ఎత్తివేత

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: నేడు సాయంత్రం  శ్రీశైలం 6 గేట్లు ఎత్తనుత్తన్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఉధృతి పెరుగుతుండడంతో జలాశయం గేట్లను ఎత్తేందుకు ఇంజనీర్లు నిర్ణయించారు.  కాగా, శ్రీ శైలానికి జూరాల, సుంకేశుల నుంచి 4,41,222 క్యూసెక్కు ల ఇన్ఫ్లో ఉంది. జూరాల నుంచి 3,60,483 క్యూసెక్కు ల ఇన్ఫ్లో ఉం ది. ఈ ప్రా జెక్టు 41 గేట్లు ఎత్తారు. సుంకేశుల ద్వారా 1,46,746 క్యూ సెక్కు ల వరద వస్తోం ది. ఆదివారం సాయం త్రం 6 గం టల సమయానికి శ్రీ శైలం మట్టం 885 అడుగులకు గాను 873.40 అడుగులుగా నమోదైం ది. నీటి నిల్వ 215.807 టీఎం సీలకు 156.38 టీఎం సీలుగా ఉం ది. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,847 క్యూ సెక్కు లను నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.

సాగర్ నీటి మట్టం 510.30 అడుగులకు (132.00 టీఎం సీలు) చేరిం ది. కుడి కాలువ ద్వారా 5,882, ఎస్ఎల్బీసీ ద్వారా 400 క్యూ సెక్కు లను విడుదల చేస్తున్నారు. మరోవైపు, ఆల్మట్టికిట్టి 2,68,222 క్యూ సెక్కు ల ఇన్ఫ్లో ఉం డగా 3.25 లక్షల క్యూ సెక్కు లను దిగువకు వదులుతున్నా రు. నారాయణపూర్ జలాశయానికి 3.20లక్షల క్యూ సెక్కు ల ఇన్ఫ్లో ఉండగా 30 గేట్లు ఎత్తి 3,27,366 క్యూ సెక్కు లను విడిచిపెడుతున్నారు. కాగా, తుంగభద్ర జలాశయానికి 1,27,100 క్యూ సెక్కు ల ఇన్ ఫ్లో ఉం డగా 33 గేట్లనుట్ల ఎత్తి 1,50,798 క్యూ సెక్కు లను దిగువకు పం పిస్తున్నారు. ఈప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 105 టీఎం సీలకు గాను 98.21 టీఎంసీలకు చేరడంతో వచ్చి న నీటిని వచ్చినట్లు వదులుతున్నా రు. కాగా,మూసీలోకి వరద చేరుతుండడంతో 645 అడుగులు పూర్తి సామర్థ్యం కాగా.. 643.20 అడుగులకు చేరుకుంది.

Related Articles

Back to top button