తెలంగాణ

రేవంత్ సంచలనం.. మున్సిపాలిటీల్లో ORR 51 గ్రామాలు విలీనం

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహా నగరాన్ని మరింతగా విస్తరించే ప్రణాళికలో భాగంగా అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను సమీపంలో ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేసింది. రేవంత్ సర్కార్ తాజా నిర్ణయంతో ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాలన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చాయి. ఇకపై అవుటర్ లోపల ఒక్క గ్రామ పంచాయతీ కూడా లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఓఆర్‌ఆర్‌ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయి.

ఏ మున్సిపాలిటీల్లో ఏఏ గ్రామాలు విలీనం అయ్యాయో చూద్దాం..

పెద్ద అంబర్‌పేట మున్సిపాలి- బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్‌ , తారామతిపేట పంచాయతీలు విలీనం
శంషాబాద్ మున్సిపాలిటీ- బహదూర్‌గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ విలీనం నార్సింగి మున్సిపాలిటీ- మీర్జాగూడ గ్రామపంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీ- హర్షగూడ గ్రామపంచాయతీ
మేడ్చల్ మున్సిపాలిటీ- పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతీలు దమ్మాయిగూడ మున్సిపాలిటీ- కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి, నాగారం మున్సిపాలిటీ- బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు
పోచారం మున్సిపాలిటీ- వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం ఘట్‌కేసర్‌ మున్సిపాల్టీ- అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ- మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు
తూంకుంట మున్సిపాలిటీ- బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button