Uncategorized

రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళను కొట్టిన ఓలా ఆటో డ్రైవర్

రైడ్ క్యాన్సిల్ చేసిన యువతిపై దాడి చేశాడు ఓలా ఆటో డ్రైవర్. ఆ యువతిని చెంపపై కొట్టాడు. బండ బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఓలా ఆటో డ్రైవర్ యువతిని కొట్టిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆటో డ్రైవర్ చర్యను తప్పుపడుతుంటే.. మరికొందరు యువతి చేసింది సరిగా లేదంటున్నారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

ఇద్దరు యువతులు జర్నీ కోసం ఆటో కావాలనుకున్నారు. అయితే పీక్ అవర్స్ కావటంతో ఆటో బుక్ కావటానికి చాలా టైం పడుతుందన్న ఉద్దేశంతో.. ఇద్దరూ ఓలాలో ఆటో బుక్ చేశారు. ఏ ఆటో ముందు వస్తే అందులో వెళ్లాలని భావించారు. అయితే రెండు ఆటోలు స్పాట్ కు వచ్చాయి. దీంతో ఒక ఆటోను ఆ రైడ్ బుక్ చేసిన యువతి క్యాన్సిల్ చేసింది. కాని అప్పటికే ఆటో అక్కడికి వచ్చేసింది.

నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆటో స్పాట్ కు చేరుకోవటానికి 15 నిమిషాలు పట్టింది. తీరా ఆటోడ్రైవర్ బుకింగ్ పాయింట్ దగ్గరకు రాగానే రైడ్ క్యాన్సిల్ చేసింది ఆ యువతి. దీంతో ఆటోడ్రైవర్ కు తీవ్ర కోపం వచ్చింది. రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశావ్.. పెట్రోల్ ఊరికే వస్తుందా.. నీ బాబు ఇస్తాడు పెట్రోల్ అంటూ కోపంగా ఊగిపోయాడు.యువతిని చెంప దెబ్బ కొట్టాడు ఆటోడ్రైవర్. మిగతా ఆటోడ్రైవర్లు, స్థానికులు జోక్యం చేసుకుని ఆటోడ్రైవర్ ను ఆపేశారు.

ఈ ఘటనను రికార్డ్ చేసిన యువతి సోషల్ మీడియాలో పోలీసులను ట్యాగ్ చేస్తూ కంప్లయింట్ చేసింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 4 కిలోమీటర్ల నుంచి వచ్చిన ఆటో రైడ్ ను ఎలా క్యాన్సిల్ చేస్తారు.. పెట్రోల్ ఊరికే వస్తుందా.. బెంగళూరు సిటీలో పీక్ అవర్స్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదా అంటూ ఆ యువతినే కడిగేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆటోడ్రైవర్ చర్యకు ఖండిస్తున్నారు. ఓలా యాప్ క్యాన్సిల్ ఆప్షన్ ఉంది.. క్యాన్సిల్ చేసింది.. ఆ యువతి తప్పు ఎలా అవుతుంది.. ఏదైనా అడగాలంటే ఓలాను అడగాలని చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button