తెలంగాణ

లంబాడ ఐక్యవేదిక ములుగు పట్టణ కమిటీ ఎన్నిక..

క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి) : జిల్లా కేంద్రంలో లంబాడ (బంజారా) కులస్తులు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో లంబాడ (బంజార) ఐక్యవేదిక ములుగు పట్టణ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ బంజార జాతి ఉన్నతి కోసం పాటుపడాలని, ములుగు పట్టణంలో జరిగే తీజ్ నవరాత్రి ఉత్సవాలు, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు మరియు ఇతరేతర పనులను ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందనే ఉద్దేశ్యంతో వారు కమిటీని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. బంజారా ఐక్యవేదిక ములుగు పట్టణ నూతన కమిటీ లో కమిటీ అధ్యక్షులు భూక్య సోమ నాయక్, ప్రధాన కార్యదర్శి పోరిక సునీల్ కుమార్, కోశాధికారులు కుమార్ పాడ్య, పోరిక జయరాం, ఉపాధ్యక్షులు లావుడ్య రమేష్, అంగోత్ రాజు నాయక్, పోరిక అనంతరాం నాయక్, పోరిక రఘరాం నాయక్, పోరిక రాహుల్ నాయక్, కార్యదర్శులు బానోత్ స్వామిదాస్, మూడ్ కసన్ సింగ్, ప్రచార కార్యదర్శులు బానోత్ సమ్మయ్య, హట్కర్ జైపాల్, భూక్య సునీల్, గుగులోత్ తిరుపతి, సాంస్కృతిక కార్యదర్శులు పోరిక శ్యామల్ నాయక్, అజ్మీర గోపిసింగ్, సంయుక్త కార్యదర్శులు గుగులోత్ రమేష్, అజ్మీర సాంబయ్య, వాంకుడోత్ లింగా నాయక్, పోరిక శంకర్, ఆహ్వాన కమిటీ సభ్యులు భూక్య జంపన్న, లావుడ్య దేశాయి, అజ్మీర రాజరాం, అదేవిధంగా బంజారా ఐక్యవేదిక కమిటీకి సలహాలు సూచనలు మరియు సమన్వయం చేయడానికి కోర్ కమిటీకి అధ్యక్షులుగా పోరిక గోవింద్ నాయక్, కోర్ కమిటీ డైరెక్టర్ లుగా జరుపుల బాలు నాయక్, పోరిక మోహన్ లాల్, పోరిక సర్వణ్ నాయక్, హట్కర్ సమ్మయ్య, పాల్తీయా సారయ్య, అజ్మీర సమ్ములు నాయక్, సభావట్ మోతీలాల్, భూక్య సమ్మయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భూక్య సోమనాయక్ మాట్లాడుతూ.. కోర్ కమిటీ అధ్యక్షులు, డైరెక్టర్లు మరియు లంబాడ (బంజార) ఐక్యవేదిక కమిటీ సభ్యులు జాతి అభ్యున్నతి కోసం పాటుపడాలని, జాతిలో ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా ముందుండాలని, ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఉండాలని తెలిపారు. ఇందుకుగాను కోర్ కమిటీ మరియు లంబాడ బంజారా ఐక్యవేదిక ములుగు పట్టణ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గాను కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటుగా కమిటీ సభ్యులందరూ ఈ ఎన్నికలో పాల్గొని ఎన్నికలకు సహకరించిన ప్రతి బంజారా నాయకులకు, అభిమానులకు, యువకులకు శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

  1. వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్.. పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశాలు
  2. లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్.. కేటీఆర్ ఆగ్రహం.. ఎస్‌ఐపై బదిలీవేటు!!
  3. డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ.. తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా
  4. వ్యాసమహర్షి పురస్కారాలకు చండూరు వాసుల ఎంపిక..
  5. అక్క భర్తను లవ్ చేసిన యువతి.. వద్దని చెప్పిన తల్లిదండ్రులు..చివరకు!!!

Related Articles

Back to top button