తెలంగాణహైదరాబాద్

లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్.. కేటీఆర్ ఆగ్రహం.. ఎస్‌ఐపై బదిలీవేటు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ పోలీసులు ది బెస్ట్ అంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. మరోవైపు కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది డిపార్ట్‌మెంట్ పరువు తీస్తున్నారు. తమ చర్యలు, చేష్టలతో పోలీసుల ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు పక్కనే వాహనాన్ని నిలిపిన ఓ డ్రైవర్‌పై ట్రాఫిక్ ఎస్సై చేయి చేసుకున్నాడు. రాయలేని భాషలో డ్రైవర్‌పై బూతు పురాణం అందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం గండి మైసమ్మ నుంచి నర్సాపూర్ వెళ్ళే దారిలో ఓ లారీ డ్రైవర్ రోడ్డు పక్కన లారీని పార్క్ చేశాడు. అయితే అలా రోడ్డు పక్కన లారీలు పార్క్ చేయటం నిబంధనలకు విరుద్ధం. విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై యాదగిరి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. లారీ ఆపిన డ్రైవర్‌ను బండ బూతులు తిడుతూ చెంపలు వాయించాడు.

Also Read : డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ.. తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా

పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాలని కింది స్థాయి సిబ్బందికి హుకుం జారీ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై నెటిజన్లు, పలువురు డ్రైవర్లు మండిపడుతున్నారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చలాన్లు వేయాలి కానీ.. ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవడం ఏంటని వారు మండిపడుతున్నారు. సాంకేతిక సమస్యతో లారీ ఆగిందని డ్రైవర్ చెబుతున్నా వినకుండా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో వైరల్ కావటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. వినరాని భాషలో పోలీస్ సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడం అభ్యంతరకరమన్నారు. ఇది పోలీస్ శాఖకు, డీజీపీకి ఆమోదయోగ్యమైన భాషేనా? అని ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Read Also : అక్క భర్తను లవ్ చేసిన యువతి.. వద్దని చెప్పిన తల్లిదండ్రులు..చివరకు!!!

ఈ మధ్య కాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు సరిగ్గా లేదని.. అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించడం లేదన్నారు. ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. ఘటనపై బీఆర్ఎస్ పార్టీ సైతం ఘాటుగా స్పందించింది. ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్ చేసింది. ‘చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా.. పాలించేటోడు ఎట్లుంటడో కింద వ్యవస్థ కూడా అట్లనే ఉంటది. తప్పు చేస్తే జరిమానా విధించాలి లేదా కేసు ఫైల్ చేయాలి కానీ దూషించుడు ఏంది? ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేసి బూతుల పోలీసింగ్ తెచ్చుడేనా మీ మార్పు?’ అని ట్వీట్ చేసింది. ఘటనపై తెలంగాణ పోలీసు శాఖ స్పందించింది. ఘటనకు బాధ్యుడైన ఎస్సైపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటన తర్వాత ఎస్‌ఐను బదిలీ చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : 

  1. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీకవిత జ్యుడిషియల్ కస్టడీ?
  2. ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు.. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోని 30 వేలకు పైగా అభ్యర్ధులు!!
  3. కేసీఆర్ మెప్పుకోసమే ఈ ప్రోటోకాల్ డ్రామా.. కాంగ్రెస్ నేతలు
  4. యూనియన్ బ్యాంకు మేనేజర్ అజయ్ ఘరానా మోసం..!

Related Articles

Back to top button