తెలంగాణహైదరాబాద్

విద్యుత్ బకాయి బిల్లు చెల్లించమంటే అధికారిపై దాడి.. కేసు నమోదు!!

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. గతంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నందుకు దాడి చేసిన ఘటనలు ఎన్నో చూశాం.. తాజాగా.. కరెంట్‌ బిల్లు కట్టలేదని నిలదీసినందుకు ఉద్యోగిపై ఓ యువకుడు దాడి చేశాడు.. ఈ ఘటన హైదరాబాద్‌ మోతీనగర్‌ పరిధిలో చోటుచేసుకుంది.. వెంకటస్వామి అనే వ్యక్తికి సంబంధించిన కరెంటు బిల్లు దాదాపు 6 వేల 800 బకాయి ఉంది. దీంతో వెస్ట్ జోన్ సర్కిల్లో విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్‌ వెంకటస్వామి ఇంటికెళ్లి కోరాడు.. ఈ విషయంపై లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌కి.. వెంకటస్వామి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది.

బిల్లు కట్టని కారణంగా కరెంట్ కట్‌ చేస్తామని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన వెంకటస్వామి కుమారుడు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేశాడు. యువకుడు కొట్టడంతో శ్రీకాంత్‌ గాయపడ్డాడు. 4 నెలలుగా కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో పవర్ సప్లై నిలిపివేస్తామని చెప్పడంతో ఘర్షణ జరిగినట్లు పేర్కొంటున్నారు. దాడిలో విద్యుత్ అధికారి శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించారు. లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. వెంకటస్వామి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి ట్విటర్ వేదికగా కేటీఆర్ కౌంటర్..
  2. వ్యక్తిగత కారణాలతో సీపీఐ నేత రాయల చంద్రశేఖర్‌ ఆత్మహత్య…
  3. ప్రజా పాలన దరఖాస్తుదారులకు ఎడిట్ ఆప్షన్…
  4. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలకు ఛాన్స్!!!
  5. రుణమాఫీ నిధులు విడుదల.. రైతువేదికల వద్ద సంబురాలు!!

Related Articles

Back to top button