తెలంగాణ

శంకర్‌పల్లి 8వ వార్డులో ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్..

క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ రాములు అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు ఫతేపూర్ లో కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్, కౌన్సిలర్, కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపట్ల నిర్లక్ష్యమే అన్నింటికీ కారణమవుతుందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఎలాంటి రోగాలు దరిచేరవని, నీటి నిల్వలతోనే దోమలువృద్ధి చెందుతాయని వీటి నివారణకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేనేజర్ అంజన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ అనూష, వార్డు ఆఫీసర్ సంధ్య, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు, ఆశ వర్కర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. విద్యుత్ బకాయి బిల్లు చెల్లించమంటే అధికారిపై దాడి.. కేసు నమోదు!!
  2. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి ట్విటర్ వేదికగా కేటీఆర్ కౌంటర్..
  3. వ్యక్తిగత కారణాలతో సీపీఐ నేత రాయల చంద్రశేఖర్‌ ఆత్మహత్య…
  4. ప్రజా పాలన దరఖాస్తుదారులకు ఎడిట్ ఆప్షన్…
  5. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలకు ఛాన్స్!!!

Related Articles

Back to top button