తెలంగాణ

సమంత కోసమే ఎన్ కన్వెన్షన్‌కు అనుమతులు!

మాదాపూర్ తుమ్మిడి చెరువులో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారుల కూల్చివేత పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014 లోనే హైకోర్టు ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని ఉత్తర్వులు ఇచ్చినా ఇన్నేళ్లు మీనమేషాలు లెక్కపెట్టారని అన్నారు. తెలంగాణ చేనేతకు నాగార్జున కోడలు సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం వెనుకున్న మతలబు ఎంటీని ప్రశ్నించారు. 2014 నుంచి ఈ కన్వెన్షన్ పై వచ్చిన ఆదాయాన్ని హీరో ముక్కుపిండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులిచ్చిన పదేళ్లు అప్పటి మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎందుకు తొలగించలేదని నిలదీశారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.

పార్టీ అని తేడా లేకుండా ఎఫ్టీఎల్, బఫర్ జొన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చాలని 2010 లోనే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు ఎంపీ రఘునందన్ రావు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994 లో మీరాలం ట్యాంక్ అక్రమ నిర్మాణాలను తొలగించారని తెలిపారు. ఈ రోజు మీరాలం ట్యాంక్ ఉందా? అక్కడ ఎంఐఎం వాళ్లకి కార్పొరేటర్లకు భయపడి హైడ్రా వెనక్కి తగ్గిందని, రేవంత్ వెళ్లి చూద్దాం రండి అని సవాల్ చేశారు. ఆంధ్రోళ్లు అనేక కబ్జాలు చేశారని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. హరీష్, కవిత, కేటీఆర్‌కు 111 జీవో పరిధిలో ఆస్తులు లేవా? అని ప్రశ్నించారు. వాటిని ఎందుకు కాపాడుతున్నారు? ముందు ముగ్గురు ఇల్లు కులగొట్టండని డిమాండ్ చేశారు. జన్వాడ ఫామ్ కొట్టడానికి రేవంత్ కు భయమెందకన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి భయపడకుండా జేసీబీలతో మీరాలం ట్యాంక్ దగ్గరికి రావాలని సూచించారు.

జన్వాడ ఫామ్ హౌస్ ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి ఎందుకు కూలగొట్టడం లేదని రఘునందన్ రావు అన్నారు. కండువాలు మార్చమని బెదిరించేందుకే కూల్చివేతలని ఆరోపించారు. ఈ ప్రభుత్వం చెరువుల వద్ద సీసీ కెమెరాల కోసం 480 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోనేలు గుర్తించడానికి మీకెంత సమయం కావాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి, హైడ్రా కు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు గుర్తించిన రెండు వేల ఐదు వందల చెరువులు కాపాడాలన్నారు. ఎన్ కన్వేషన్ మీద హైకోర్టు స్టే ఎలా ఇస్తుందని బీజేపీ ప్రశ్నించారు. బరా బర్ కూలగొట్టాల్సిందేనని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button