తెలంగాణనల్గొండ
Trending

సమస్యలు పరిష్కరించాలని చేనేతల మహా ర్యాలీ

  • చౌరస్తాలో రాస్తారోకోతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
  • ప్రింటెడ్ చీరెలను దహనం చేసిన కార్మికులు….

చండూరు, క్రైమ్ మిర్రర్:  సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చండూరులో చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్లు, పద్మశాలీలు ఆదివారం చేనేత మహా ర్యాలీని చేపట్టారు. ముందుగా అందరూ మార్కండేయ దేవాలయానికి చేరుకొని అక్కడి నుంచి ప్లకార్డులు, ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ చౌరస్తాకు చేరుకున్నారు. రోడ్డుపై బైటయించి రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం జరిగింది. ప్రింటెడ్ చీరలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వాటిని దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ. 11 నెలలుగా త్రిఫ్ట్ పండ్ నిధులు రావడం లేదని, 8 నెలలుగా ఆగి చేనేత మిత్ర నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిలువ ఉన్న వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు ప్రభుత్వం చేనేత చీరెలను పంపిణీ చేయాలని కోరారు. రైతు రుణమాఫీ మాదిరిగానే చేనేత రుణమాఫీని చేపట్టాలని ప్రభుత్వ పూచికత్తు పైన కార్మికులకు రూ. 2లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రింటెడ్ చీరలను వెంటనే ప్రభుత్వ అరికట్టాలని డిమాండ్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా చేనేత బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత రంగానికి రూ.2000 కోట్లు కేటాయించాలన్నారు. తమ పోరాటం దీంతో ఆగదని ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వీవర్ల సంఘం అధ్యక్షుడు జూలూరు ఆంజనేయులు, కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాసు దాసు శ్రీనివాసులు, చేనేత పరిరక్షణ సేవాసమితి అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, డిసిసిబి డైరెక్టర్ జూలూరు శ్రీనివాస్ లు , కౌన్సిలర్ రాధిక శ్రీనివాసులు, జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, కందగట్ల భావన ఋషి, ఉభయ కమిటీ దేవాలయాల చైర్మన్ రావిరాల నగేష్, కర్నాటి శ్రీనివాసులు, పులిపాటి ప్రసన్న, రావిరాల శ్రీను, చెరిపల్లి కృష్ణ, చెరుపల్లి అంజయ్య, చిట్టిప్రోలు వెంకటేశం, దుస్స గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button