తెలంగాణ

హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :  తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది.సిద్దిపేటలో అర్థరాత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీసుపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాడి చేశారు. తాళాలు పగలగొట్టి పలు వస్తువులను ధ్వంసం చేశారు. క్యాంప్‌ ఆఫీస్ దగ్గర ఉన్న ఫ్లెక్సీలను చించేశారు.దాడికి పాల్పడిన దుండగులు.. జై కాంగ్రెస్‌, జైజై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వారిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రావడంతో హరీష్‌ ఆఫీస్‌ దగ్గర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను బయటకు పంపించేశారు.

సిద్దిపేటలోని తన క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై స్పందించారు హరీష్‌ రావు. అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్‌ గూండాలు దాడి చేయడం రాష్ట్రంలో శాంతిభద్ర‌తలు లేవనడానికి నిదర్శనమన్నారు. తాళాలు పగులగొట్టి, ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం అన్న హరీష్‌ రావు..ఇది తీవ్రమైన చర్య అంటూ సీరియస్ అయ్యారు.

Read More : విలీనంపై మాట్లాడని కేసీఆర్,హరీష్.. రేవంత్ చెప్పిందే నిజమా! 

క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని అడ్డుకోకపోవడమే కాకుండా, నిందితులకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు హరీష్‌ రావు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత నిర్దాక్షిణ్యంగా దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్న హరీష్‌ రావు.. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Related Articles

Back to top button