తెలంగాణ

చంద్రబాబు దెబ్బకు వణికిపోతున్న రేవంత్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు రాబోతున్నాయా..? సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని దెబ్బ తగలబోతుందా..? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అది కూడా తాను గురువు చెప్పుకునే నేత నుంచే వస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి పరేషాన్ అవుతున్నారని చెబుతున్నారు. ఏపీలో చేసిన రాజకీయ ప్రయోగమే తెలంగాణలోనూ చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు రంగం సిద్దం చేశారట. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి బంపర్ విక్టరీ కొట్టాయి. వై నాట్ 175 అని నినదించిన జగన్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది.ఇప్పుడు అదే ప్రయోగాన్ని తెలంగాణలోనూ చేయాలని టీడీపీనిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయట.

చాలాకాలంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకటేనని గులాబీ పార్టీ నాయకులు పాడుతుంటే, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వారు పాడుతున్నారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తమ వాదనను జస్టిఫై చేసుకోవడానికి అనేక ఉదంతాలు, ఉదాహరణలు చూపిస్తున్నారు.కానీ ఇప్పుడు టీడీపీ -బీజేపీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆ వాదనలు డొల్ల అని తేలిపోయింది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలని రాష్ట్ర టీడీపీ నాయకులు బాబును అడిగారు. కానీ ఆయన నిరాకరించాడు. అందుకు కొన్ని కారణాలు చెప్పాడు. అసలు కారణం ఏమిటంటే …కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని, టీడీపీ పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వెళ్లి బాబును వేడుకున్నట్లు వార్తలు వచ్చాయి.

పూర్వాశ్రమంలో ఇద్దరూ గురు శిష్యులు. అందుకే రేవంత్ రెడ్డి అభ్యర్థనను బాబు మన్నించాడని అంటారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదు. టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోనున్నాయి.టీడీపీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి నష్టమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు.

Related Articles

Back to top button