తెలంగాణ

ICUలో తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క..కన్నీళ్లు పెట్టించే ఘటన

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : అక్కా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఎన్ని గొడవలున్నా రాఖీ పౌర్ణమి రోజు సోదరులకు రాఖీ కడతారు అక్కాచెల్లెళ్లు. పండగ రోజు అక్క రాకపోతే తమ్ముళ్లు తల్లఢిల్లిపోతుంటారు. అందుకే ఎక్కడున్నా రాఖీ పౌర్ణమి రోజు ఇంటికి వచ్చి అన్నా తమ్ముళ్లకు రాఖీలు కడతారు. అయితే రాఖీ రోజే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామంలో కన్నీళ్లీ పెట్టించే ఘఠన చోటుచేసుకుంది.

చదువులో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలని అనుకున్న ఆ అమ్మాయి ఆశలను ఓ ఆకతాయి తుంచేశాడు.. అతడి వేధింపులకు తాళలేక ఆమె ఆత్మహత్యయత్నం చేసింది. ఆసుపత్రిలో కోన ఊపిరితో ఉన్న సమయంలో తన తమ్ముడికి, పెదనాన్న కుమారుడికి రాఖీలు కట్టిన కొద్దీ గంటలలో కన్నుమూసింది.

Read More : జైలులో ఏడుస్తున్న కవిత.! కేసీఆర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లే..

కోదాడ లోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది అమ్మాయి. అదే కళాశాల కు చెందిన ఓ ఆకతాయి ప్రేమ పేరిట తరచూ వేదించడం తో తీవ్ర మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది.అనంతరం ఆమెను మహబూబాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తెల్లవారితే రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనని ఆమె తమ్ముడితో పాటు పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. అనంతరం తెల్లవారు జామున ఆమె కన్నుమూసింది.ఈ ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

Related Articles

Back to top button